-
-
Home » Andhra Pradesh » East Godavari » crop loss fire
-
పంట నష్టం వచ్చిందని..
ABN , First Publish Date - 2020-11-25T05:49:24+05:30 IST
పి.మల్లవరం సర్వే నెం. 61/1ఎలో మూడు ఎకరాల వరిచేనును కౌలురైతు పాలూరి రామకృష్ణ మంగళవారం తగలబెట్టే ప్రయత్నం చేశారు.

వరిచేను తగలబెట్టే ప్రయత్నం
తాళ్లరేవు, నవంబరు 24: పి.మల్లవరం సర్వే నెం. 61/1ఎలో మూడు ఎకరాల వరిచేనును కౌలురైతు పాలూరి రామకృష్ణ మంగళవారం తగలబెట్టే ప్రయత్నం చేశారు. వర్షాల కారణంగా వరిచేను మునిగిపోయి దెబ్బతిందని, కోసేందుకు ఏమీలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు ఎకరాలకు పెట్టుబడి లక్ష రూపాయలు అయ్యిందని వరిచేనును కోసినా కూలీల ఖర్చులు కూడా రావని అన్నారు. రెవెన్యూ, సచివాలయం అధికారులు పట్టించుకోలేదని అందుకే మనస్తాపంతో వరిచేను తగలబెట్టే ప్రయత్నం చేశానన్నారు. అగ్రికల్చర్ అసిస్టెంట్ కౌలు రైతును ఓదార్చి మంటలను ఆర్పారు. కౌలురైతు ఆధార్‌కార్డు, బ్యాంక్ ఖాతా, జిరాక్స్ కాఫీలు తీసుకుని పంట నష్టం అందించేందుకు నమోదు చేస్తామన్నారు.