క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు

ABN , First Publish Date - 2020-10-19T06:02:21+05:30 IST

సులువుగా డబ్బు సంపాదించడానికి అలవాటు పడిన యువత క్రికెట్‌ బెట్టింగ్‌లకు బలవుతున్నారు. మండపేటలో ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వాహకులపై పోలీసులు శనివారం దాడి చేశారు. ఐదుగురిని అరెస్టు చేసి రూ.7.52 లక్షలతో పాటు ఐదు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నామని రామచంద్రపురం డీఎస్పీ డి.బాలచంద్రరెడ్డి ఆదివారం విలేఖరులకు తెలిపారు.

క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ

మండపేట, అక్టోబరు 18: సులువుగా డబ్బు సంపాదించడానికి అలవాటు పడిన యువత క్రికెట్‌ బెట్టింగ్‌లకు బలవుతున్నారు. మండపేటలో ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వాహకులపై పోలీసులు శనివారం దాడి చేశారు. ఐదుగురిని అరెస్టు చేసి రూ.7.52 లక్షలతో పాటు ఐదు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నామని రామచంద్రపురం డీఎస్పీ డి.బాలచంద్రరెడ్డి ఆదివారం విలేఖరులకు తెలిపారు. పట్టణంలోని గొల్లపుంతకాలనీలో ఒక ఇంట్లో పందేల నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ ఆదేశాల మేరకు అనపర్తి సీఐ భాస్కరరావు, మండపేట పట్టణ ఎస్‌ఐ తోట సునీత సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఐదుగురు నిర్వాహకులు పి.కె.సతీష్‌, ఎస్‌.అబ్దుల్లా, కె.కృష్ణార్జున, వీఎన్‌ శ్రీనివాస్‌, కె.జగదీష్‌లను అరెస్టు చేశామని, వారి కాల్‌డేటా ఆధారంగా వారితో సంబంధం ఉన్న మరో 81మంది గుర్తించి వారిపైనా కేసులు నమోదు చేశామని డీఎస్పీ బాలచంద్రరెడ్డి తెలిపారు. నిందితులను న్యాయస్థానంలో హాజరు పరుస్తున్నామన్నారు. నిందితులను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన మండపేట ఇన్‌చార్జి సీఐ భాస్కరరావు, మండపేట పట్టణ ఎస్‌ఐ తోట సునీత, స్టేషన్‌ సిబ్బందిని ఎస్పీ అభినందించారని, వారికి రివార్డు కూడా ప్రకటించారని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో ఇన్‌చార్జి సీఐ భాస్కరరావు, పట్టణ ఎస్‌ఐ తోట సునీత పాల్గొన్నారు. మండపేటలో ఏసుక్రీస్తు మేరీమాత విగ్రహాల ధ్వంసం కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఇప్పటివరకు నేరం ఎవరు చేశారన్నది తేలలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా డీఎస్పీ చెప్పారు.

Updated Date - 2020-10-19T06:02:21+05:30 IST