పన్నుల భారం తగదు
ABN , First Publish Date - 2020-12-03T05:35:29+05:30 IST
కార్పొరేషన్ (కాకినాడ), డిసెంబరు 2: పట్టణ ప్రజలపై ఆస్తి పన్నుల భారం తగదని సీపీఎం ఆధ్వర్యాన బుధవారం ఉదయం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మోర్త రాజశేఖర్ మాట్లాడుతూ భూముల రిజిస్ట్రేషన్ విలు

ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం నిరసన
కార్పొరేషన్ (కాకినాడ), డిసెంబరు 2: పట్టణ ప్రజలపై ఆస్తి పన్నుల భారం తగదని సీపీఎం ఆధ్వర్యాన బుధవారం ఉదయం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మోర్త రాజశేఖర్ మాట్లాడుతూ భూముల రిజిస్ట్రేషన్ విలువ, భవన నిర్మాణ విలువలు పెంచుతామనడం దారుణమన్నారు. కరోనా నేపఽథ్యంలో తెలంగాణలో ఆస్తి పన్నులో 50 శాతం రాయితీ కల్పించారని, మన రాష్ట్రంలో కూడా పన్ను రాయితీ కల్పించాలని కోరారు. సీపీఎం నగర కమిటీ సభ్యుడు పలివెల వీరబాబు మాట్లాడుతూ నగరపాలక సంస్థ పాలకవర్గం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కౌన్సిల్లో తీర్మానం చేయాలని కోరారు. అనంతరం కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు వినతిపత్రం సమర్పించారు. దూసర్లపూడి రమణరాజు, సీనియర్ నాయకుడు కె.సత్తిరాజు, ట్రేడ్ యూనియన్ నాయకుడు రాజ్‌కుమార్ పాల్గొన్నారు.