కొవిడ్ కేసులు 464
ABN , First Publish Date - 2020-10-28T06:45:03+05:30 IST
గడిచిన 24 గంటల్లో జిల్లాలో 464 మంది వైరస్ బారిన పడినట్టు నిర్ధారణ అయింది. ఇందులో ట్రూనాట్ ద్వారా చేసిన 192, రాపిడ్ కిట్లతో చేసిన పరీక్షల ద్వారా 272 కేసులను గుర్తించారు.

- మొత్తం బాధితులు 1,14,137 మంది
- ఇద్దరి మృతి.. 605కి చేరిన మరణాలు
కాకినాడ, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): గడిచిన 24 గంటల్లో జిల్లాలో 464 మంది వైరస్ బారిన పడినట్టు నిర్ధారణ అయింది. ఇందులో ట్రూనాట్ ద్వారా చేసిన 192, రాపిడ్ కిట్లతో చేసిన పరీక్షల ద్వారా 272 కేసులను గుర్తించారు. దీంతో కరోనా సోకిన బాధితులు మొత్తం 1,14,137కి చేరారు. తాజాగా ఇద్దరి మృతితో కరోనా మరణాలు 605కి చేరాయి. ఇక యాక్టివ్ దశలో 4,931 మంది ఉండగా, వైద్యం పొంది 1,08,601 మంది కోలుకున్నారు.