ఇద్దరు విద్యార్థులకు కొవిడ్‌

ABN , First Publish Date - 2020-12-02T05:26:44+05:30 IST

స్థానిక ఆశ్రమ బాలికోన్నత పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

ఇద్దరు విద్యార్థులకు కొవిడ్‌

గంగవరం ఆశ్రమ పాఠశాలలో కరోనా కలకలం

గంగవరం, డిసెంబరు 1: స్థానిక ఆశ్రమ బాలికోన్నత పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.  గత నెల 27న పాఠశాలలోని సుమారు 130 మంది విద్యార్థులకు టెస్ట్‌లు నిర్వహించారు.  ఆ టెస్టుల్లో  9,10వ తరగతులకు చెందిన ఇద్దరు బాలికలకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పీహెచ్‌సీ వైద్యాధికారి అనూష తెలిపారు. పాజిటివ్‌ నిర్ధారణ అయిన విద్యార్థులను వారి స్వగ్రామాలకు తరలించి హోం క్వారంటైన్‌లో ఉంచారు. వైద్య పరీక్షలు నిర్వహించేనాటికి పాఠశాలలో సుమారు 150 మంది విద్యార్థినులు వసతి పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థినులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక నుంచి విద్యార్థులందరూ ముందుగా కరోనా పరీక్షలు చేయించుకుని వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. 

Updated Date - 2020-12-02T05:26:44+05:30 IST