-
-
Home » Andhra Pradesh » East Godavari » covid minister venu
-
అధికార యంత్రాంగం కృషి భేష్
ABN , First Publish Date - 2020-10-31T06:20:01+05:30 IST
కొవిడ్-19 నియంత్రణలో జిల్లా అధికార యంత్రాంగం విశేషంగా కృషి చేసిందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు.

మంత్రి వేణుగోపాలకృష్ణ
డెయిరీఫారమ్ సెంటర్(కాకినాడ), అక్టోబరు 30: కొవిడ్-19 నియంత్రణలో జిల్లా అధికార యంత్రాంగం విశేషంగా కృషి చేసిందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. వైద్య, పోలీస్, సచివాలయ శాఖలకు చెందిన కరోనా వారియర్స్‌ను శుక్రవారం సత్కరించారు. కలెక్టరేట్ విఽధాన గౌతమీ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి వేణగోపాలకృష్ణ మాట్లాడుతూ కొవిడ్ నియంత్రణలో జిల్లా ఆదర్శంగా నిలిచిందన్నారు. కొవిడ్‌పై అలక్ష్యం వహిస్తే మళ్లీ వచ్చే ప్రమాదం ఉందని, ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని అధికారులకు సహకరించాలన్నారు. కలెక్టర్ మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 21 నుంచి ఇప్పటి వరకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. జాయింట్ కలెక్టర్లు చేకూరి కీర్తి, జి.రాజకుమారి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, అదనపు ఎస్పీ కరణం కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కేవీఎస్ గౌరీశ్వరరావు, రాజమహేంద్రవరం డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రమేష్‌కిశోర్ పాల్గొన్నారు.