కాకినాడ జీజీహెచ్‌లో.. కొవిడ్‌తో ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2020-09-29T17:19:52+05:30 IST

కొవిడ్‌ బారిన పడి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స తీసుకుంటున్న ఇద్దరు సోమవారం..

కాకినాడ జీజీహెచ్‌లో.. కొవిడ్‌తో ఇద్దరి మృతి

తూర్పు గోదావరి: కొవిడ్‌ బారిన పడి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స తీసుకుంటున్న ఇద్దరు సోమవారం మృతి చెందారు. గండేపల్లికి చెందిన 45 ఏళ్ల వ్యక్తి, కాకినాడకు చెందిన 82 ఏళ్ల వృద్ధుడు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు నోడల్‌ అధికారి డాక్టర్‌ కిరణ్‌ తెలిపారు. కొవిడ్‌ బారిన పడి కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో ప్రస్తుతం 485 మంది చికిత్స తీసుకుంటున్నారన్నారు. 


Updated Date - 2020-09-29T17:19:52+05:30 IST