అంతకంతకూ...

ABN , First Publish Date - 2020-06-18T10:16:52+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ విజృంభణ ఏమాత్రం ఆగడం లేదు. ఎక్కడికక్కడ చాపకింద నీరులా పాకిపోతోంది.

అంతకంతకూ...

జిల్లాలో బుధవారం 27 పాజిటివ్‌లు 

మొత్తం 590కి చేరిన కొవిడ్‌ కేసులు


(కాకినాడ-ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో కొవిడ్‌ విజృంభణ ఏమాత్రం ఆగడం లేదు. ఎక్కడికక్కడ చాపకింద నీరులా పాకిపోతోంది. రోజురోజుకు బాధి తుల సంఖ్యను పెంచుతోంది. అటు ఇంత వరకు కొవిడ్‌ జాడ తెలియని కొత్త ప్రాం తాల్లోను వైరస్‌ విస్తరిస్తోంది. దీంతో బాధితులు అంతకంతకు పెరుగుతున్నారు. బుధవారం జిల్లావ్యాప్తంగా 27 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. వీరంతా 15 మండలాలకు చెందినవారు కాగా ఇందులో 11 మంది మహిళలు, 16 మంది పురుషు లు ఉన్నారు. కాకినాడ వాకలపూడికి చెంది న 65 ఏళ్ల మహిళకు స్థానికంగా పాజిటివ్‌ సోకిన వ్యక్తి ద్వారా వైరస్‌ వ్యాపించింది. కాకినాడలో జగన్నాయక్‌పూర్‌ సమీపంలో నరసింహరోడ్డులో పురం వారి వీధిలో 40 ఏళ్ల వ్యక్తి ఈయనకు పది రోజులుగా జ్వరం ఉండడంతో పరీక్షిస్తే కొవిడ్‌గా తేలింది.


ఈయన 42 ఏళ్ల స్నేహి తుడు అదే ప్రాంతంలో నివసిస్తుండగా ఆయనకు కూడా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వీరిద్దరి నుంచి కాకినాడలో తారకరామ నగర్‌కు చెందిన ఓ వెల్డర్‌ (32)కు వైరస్‌ వ్యాపించింది. కాకినాడ ఏపీఎస్పీలో 55 ఏళ్ల వ్యక్తి ధోబీగా  పనిచేస్తున్నాడు. ఈయనకు పాజి టివ్‌ నిర్ధారణ అయింది. ఇటీవల రాజమహేంద్రవరం నెహ్రూనగర్‌లో పాజిటివ్‌ వచ్చిన ఓ వ్యక్తి ద్వారా అదే ప్రాంతంలోని కుటుంబ సభ్యులైన 44 ఏళ్ల మహిళకు, 48 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్‌ తేలింది. 


క్రెడిట్‌కార్డుల జారీ పనికోసం వెళ్లి....

రాజమహేంద్రవరం తులిప్స్‌ అపార్ట్‌మెంట్‌లో ఉం టున్న 27 ఏళ్ల మహిళ ఈనెల 6న విజయవాడ వెళ్లొచ్చారు. పరీక్షలు చేయించుకోగా కొవిడ్‌గా తేలింది. రాజమహేంద్రవరంలో 33 ఏళ్ల వ్యక్తి నిర్మాణరంగంలో పనిచేస్తుండగా వైరస్‌ వ్యాపించి కొవిడ్‌గా నిర్ధారణ అయింది. పెద్దాపురానికి చెందిన తల్లీకొడుకులకు కొవిడ్‌ సోకింది. 25 ఏళ్ల వ్యక్తి కాకినాడ స్టేట్‌బ్యాంక్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. క్రెడిట్‌ కార్డుల జారీ పనిపై తరచూ కాకినాడ నుంచి రాకపోకలు సాగిస్తుండడంతో వైరస్‌ బారిన పడ్డాడు. ఈయన నుంచి ఆయన 40 ఏళ్ల తల్లికి కూడా పెద్దాపురంలో మాగంటివారి వీధిలో పాజిటివ్‌ నిర్ధారణ అయింది. సామర్లకోటకు చెందిన తొమ్మిదేళ్ల బాలిక ఈనెల 10న తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్‌ నుంచి వచ్చారు. ఈమెకు వైరస్‌ సోకింది. అటు సామర్లకోటలో పవరకు చెందిన 45 ఏళ్ల వ్యక్తి స్థానికంగా ఓ ప్రైవేటు స్కూలు టీచర్‌. జ్వరం రావడంతో పరీక్ష చేయించు కోగా కొవిడ్‌ నిర్ధారణ అయింది. 


కరెన్సీ చెస్ట్‌లో పనిచేసిన వ్యక్తికి..

ధవళేశ్వరంలో రెండు పాజిటివ్‌లు నమోద య్యా యి. 33 ఏళ్ల వ్యక్తి విజయబ్యాంకు కరెన్సీ చెస్ట్‌లో పని చేస్తున్నాడు. ఈయనకు పాజిటివ్‌గా తేలింది. అటు ధవళేశ్వరం ఇండస్ట్రియల్‌ కాలనీకి చెందిన 33 ఏళ్ల వ్యక్తి హైదరాబాద్‌లో ఫ్లిప్‌కార్టులో పనిచేస్తూ ఈనెల 14న ఇంటికి వచ్చాడు. పరీక్షిస్తే పాజిటివ్‌గా తేలింది. ఇటీవల కడియంలో పాజిటివ్‌ వచ్చిన మండపేట సచివాలయ మహిళా కానిస్టేబుల్‌ ద్వారా మండపేట సంగం కాలనీకి చెందిన 26 ఏళ్ల వ్యక్తికి బుధవారం పాజిటివ్‌ నిర్దారణ అయింది. ఇక మండపేట సచివా లయంలో వలంటీర్‌గా పనిచేస్తున్న 25 ఏళ్ల మహిళకు కూడా ఈమె ద్వారా వైరస్‌ సంక్రమించి ఈవిడకు కూడా పాజిటివ్‌గా తేలింది. 


డెలివరీ తర్వాత కొవిడ్‌ నిర్ధారణ...

కాజులూరు మండలం ఆర్యవటంలో 18 ఏళ్ల మహి ళ గర్భవతి. ఈనెల 16న స్థానికంగా ఓ ఆసుపత్రిలో డెలివరీ అయింది. ఈమెకు పాజిటివ్‌గా తేలింది. గన్నవరం మండలం ఆర్‌ ఏనుగుపల్లికి చెందిన 54 ఏళ్ల వ్యక్తికి భార్య ద్వారా వైరస్‌ వ్యాపించింది. అమలాపురం బండారులంకకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి అనంతపురం నుంచి ఈనెల 14న వచ్చాడు. పరీక్షిస్తే పాజిటివ్‌గా తేలింది. కపిలేశ్వరపురంలో 64 ఏళ్ల వ్యక్తి ఇటీవల పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ద్వారా వైరస్‌ బారిన పడ్డాడు. ఆలమూరు మండలం పెనికేరులో 44 ఏళ్ల వ్యక్తి అనపర్తిలో గుడ్లు సరఫరా చేస్తుంటాడు. ఈయ నకు పాజిటివ్‌గా తేలింది.


ఏజెన్సీలో నర్సింగ్‌ విద్యార్థినులు..

చింతూరు మండలం తులసిపాకల పీహెచ్‌సీ పరిధిలో 33 ఏళ్ల వ్యక్తి ఒంగోలు నుంచి ఈనెల 16న వచ్చాడు. పరీక్షలు చేయిస్తే పాజిటివ్‌ వచ్చింది. కూన వరం మండలం కూటూరులో 20 ఏళ్ల యువతి విజ యవాడలో నర్సింగ్‌ విద్యార్థి. ఇంటికి వచ్చి పరీక్షలు చేస్తే పాజిటివ్‌ వచ్చింది. ఎటపాక మండలం గౌరీ దేవిపేట పీహెచ్‌సీ పరిధిలో 19 ఏళ్ల యువతి విజ యవాడలో నర్సింగ్‌ చదువుతూ ఇంటికి రాగా పాజిటి వ్‌గా తేలింది. అల్లవరం మండలంలో భార్యాభర్తలకు  పాజిటివ్‌ వచ్చింది. ఇక్కడ మొగళ్లమూరికి చెందిన 42 ఏళ్ల వ్యక్తి ముంబై నుంచి ఈనెల 9న వచ్చాడు. పరీక్ష లు చేస్తే ఈయనకు, భార్యకు పాజిటివ్‌ వచ్చింది.

Updated Date - 2020-06-18T10:16:52+05:30 IST