ఈ నెల 21 నుంచి 30 వరకు కొవిడ్ అవగాహన ర్యాలీలు
ABN , First Publish Date - 2020-10-21T05:53:52+05:30 IST
కొవిడ్-19 వైరస్ జిల్లాలో ప్రబలిన నాటి నుంచి ఇప్పటి వరకు వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నియంత్రణ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని డీఎంహెచవో డాక్టర్ కేవీఎస్ గౌరేశ్వరరావు తెలిపారు.

కాకినాడ,అక్టోబరు20(ఆంధ్రజ్యోతి): కొవిడ్-19 వైరస్ జిల్లాలో ప్రబలిన నాటి నుంచి ఇప్పటి వరకు వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నియంత్రణ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని డీఎంహెచవో డాక్టర్ కేవీఎస్ గౌరేశ్వరరావు తెలిపారు. అయితే ప్రజల్లో వ్యాధి పట్ల పూర్తి అవగాహన లేకపోవడం వల్ల , తమ సిబ్బంది ఎంత అవగాహన కల్పించినా పెడచెవిన పెట్టడంతో గత నెల వరకు జిల్లా వ్యాప్తంగా హెచ్చు సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. పరిస్థితి గమనించిన కలెక్టర్ కేసుల తగ్గుముఖం, జీరో స్థాయికి తీసుకురావాలని పదేపదే సమీక్షల్లో తమకు ఆదేశాలిస్తూ వస్తున్నారన్నారు. ఈ క్రమంలో మరోమారు కరోనా నియంత్రణపై ఈ నెల 21 నుంచి 30 వరకు జిల్లా వ్యాప్తంగా తమ సిబ్బంది అవగాహన ర్యాలీలు చేస్తారన్నారు.