ఆన్‌లైన్‌లో పాలిసెట్‌ కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2020-10-12T16:41:28+05:30 IST

పాలిసెట్‌-2020కు సంబంధించి ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్టు..

ఆన్‌లైన్‌లో పాలిసెట్‌ కౌన్సెలింగ్‌

నేటి నుంచి 18 వరకు ఆప్షన్ల నమోదు


రాజమహేంద్రవరం(ఆంధ్రజ్యోతి): పాలిసెట్‌-2020కు సంబంధించి ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్టు బొమ్మూరులోని డాక్టర్‌ బీఆర్‌ ఏజీఎంఆర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ వి.నాగేశ్వరరావు  తెలిపారు. ఈ మేరకు  ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సోమ వారం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను అప్‌లోడ్‌ చేయాలన్నారు. 14 నుంచి 17వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందన్నారు. 12 నుంచి 18 వరకు విద్యార్థులు ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. 20న  సీట్లు కేటాయిస్తామని, సీట్లు దక్కినవారు 21 నుంచి 27వ తేదీ వరకు సంబంధిత పాలిటెక్నిక్‌ కళాశాలలో రిపోర్ట్‌ చేయాలన్నారు. ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌, సర్టిఫికెట్ల అప్‌లోడ్‌ కోసం ఏపీ.పాలిసెట్‌.నిక్‌.ఇన్‌లో అవకాశం కల్పించినట్టు తెలిపారు.  ప్రాసెసింగ్‌ ఫీజుగా ఓసీ, ఈడబ్ల్యుఎస్‌, బీసీ కేటగిరీల అభ్య ర్థులు రూ.700, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల అభ్యర్థులు రూ.400 ఆన్‌ లైన్‌ ద్వారా చెల్లించాలన్నారు. వెరిఫైడ్‌ అని వచ్చిన తర్వాత మాత్రమే కళాశాలల ఆప్షన్లు ఎంచుకోవాలని సూచించారు. సందేహాల నివృత్తి కోసం బొమ్మూరులోని డాక్టర్‌ బీఆర్‌ ఏజీఎంఆర్‌ పాలిటెక్నిక్‌, కాకినాడలోని ఆంధ్ర పాలిటెక్నిక్‌ కళాశాలల్లోని హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లో సంప్రదించాలని ప్రిన్సిపాల్‌ నాగేశ్వరరావు కోరారు.

Updated Date - 2020-10-12T16:41:28+05:30 IST