కిర్లంపూడిలో ప్రత్తి రైతుల ధర్నా

ABN , First Publish Date - 2020-12-05T06:32:50+05:30 IST

కిర్లంపూడిలో భారతీ ప్రత్తి సంస్థ ప్రభుత్వ కొనుగోలు కేంద్రం వద్ద శుక్రవారం రైతులు ధర్న నిర్వహించారు.

కిర్లంపూడిలో ప్రత్తి రైతుల ధర్నా

కిర్లంపూడి డిసెంబరు 4: కిర్లంపూడిలో భారతీ ప్రత్తి సంస్థ ప్రభుత్వ కొనుగోలు కేంద్రం వద్ద శుక్రవారం రైతులు ధర్నా నిర్వహించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి రైతులు ప్రత్తిని తెస్తున్నారు. ఎకరాకు 10నుంచి 12క్వింటాల వరకు ప్రత్తిని పండిస్తే ప్రభుత్వం 4క్వింటాలే కొనడంపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వాహనాలపై తెచ్చిన ప్రత్తిని ఏమి చేయాలో తెలీక ఆందోళనకు దిగారు. మిగిలిన ప్రత్తిని కూడా కొనుగోలు చేయాలని కోరుతూ అధికా రులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం క్వింటాకు రూ.5,800 చెల్లిస్తుండగా దళారులకు అమ్మితే రూ.5000 మాత్రమే వస్తుందని, రూ.800 నష్టపోతున్నామని వారు వాపోయారు. ఇప్పటికైన ప్రభుత్వం ప్రత్తిని పూర్తిస్థాయిలో కొనుగోలు చెయ్యాలని, లేనిపక్షంలో మిగిలిన ప్రత్తిని తగులపెట్టుకోవాలా అని అధికారులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌ మాట్లాడుతూ వ్యవసాయశాఖ నమోదుచేసిన వివరాల ప్రకారం ప్రత్తిని కొనుగోలు చేస్తున్నామని, మిగిలిన ప్రత్తి కొనుగోలు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టిలో పెడతామని చెప్పారు. జిల్లా అగ్రికల్చ్‌ర్‌ డీడీ మాధవరావును ఫోను ద్వారా అడుగగా రెండురోజుల్లో 4క్వింటాల నుంచి 12క్వింటాల వరకు ప్రభుత్వం కొనుగోలు చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. 


Updated Date - 2020-12-05T06:32:50+05:30 IST