జీజీహెచ్‌లో మరో ఇద్దరికి కరోనా వైరస్‌ పరీక్షలు

ABN , First Publish Date - 2020-03-21T09:17:57+05:30 IST

కాకినాడ జీజీహెచ్‌లో శుక్రవారం మరో ఇద్దరికి కోవిడ్‌-19పరీక్షలు నిర్వహించారు. ఇటీవల

జీజీహెచ్‌లో మరో ఇద్దరికి కరోనా వైరస్‌ పరీక్షలు

జీజీహెచ్‌(కాకినాడ), మార్చి 20: కాకినాడ జీజీహెచ్‌లో శుక్రవారం మరో ఇద్దరికి కోవిడ్‌-19పరీక్షలు నిర్వహించారు. ఇటీవల ఇంగ్లాండ్‌నుంచి వచ్చిన రాజమహేంద్రవరానికి చెందిన 22 ఏళ్ల యువకుడిని ఎయిర్‌పోర్టు అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు వైద్యఆరోగ్యశాఖాధికారులు జీజీహెచ్‌కు తరలించారు. రాజమహేంద్రవరానికి చెందిన 23ఏళ్ల యువతి ఇటీవల దేశంలోని ఢిల్లీ, యూపీ తదితర ప్రాంతాల్లో పర్యటించి వచ్చింది. ఆమెకు జలుబు, పడిసం, దగ్గు ఉన్న కారణంగా ఓఎన్జీసీ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఆమెను వైద్యఆరోగ్యశాఖాధికారులు కాకినాడకు తరలించారు. జీజీహెచ్‌లోని పల్మనాలజీ విభాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డుకు తరలించి వారి ఇద్దరి గొంతు నుంచి శ్వాబ్‌ నమూనాను తీసి వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. నివేదిక రెండురోజుల్లో రానున్నట్లు నోడల్‌ అధికారి డాక్టర్‌ కిరణ్‌ తెలిపారు.


Updated Date - 2020-03-21T09:17:57+05:30 IST