నేడు ఉచితంగా కరోనా పరీక్షలు

ABN , First Publish Date - 2020-10-07T10:31:11+05:30 IST

జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కీర్తి ఆధ్వర్యంలో గంగవరం సచివాలయం వద్ద బుధవారం ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఎంపీడీవో జాన్‌మిల్టన్‌ తెలిపారు...

నేడు ఉచితంగా కరోనా పరీక్షలు

గంగవరం, అక్టోబరు 6: జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కీర్తి ఆధ్వర్యంలో గంగవరం సచివాలయం వద్ద బుధవారం ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఎంపీడీవో జాన్‌మిల్టన్‌ తెలిపా రు. మండలంలో పరీక్షలు చేయించుకునేవారు గంగవరం సచివాయంలో, స్థానిక వైద్య సిబ్బందినిగాని సంప్రదించాలన్నారు. తప్పనిసరిగా ఆధార్‌కార్డు, సెల్‌ నెంబర్‌తో రావాలని ఆయన కోరారు.


వరరామచంద్రాపురంలో...

వరరామచంద్రాపురం: స్థానిక జూనియర్‌ కళాశాలలో ఉదయం 10 గంటల నుంచి సుమారు 150 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఎంపీడీవో శ్రీనివాస్‌ తెలిపారు. 

Read more