ఓ వ్యక్తికి కరోనా.. హోంక్వారంటైన్.. పిలిచినా పలకకపోవడంతో తలుపులు తీసి చూస్తే..
ABN , First Publish Date - 2020-08-04T22:11:43+05:30 IST
పాజిటివ్ వచ్చిన వ్యక్తి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని మొండెపులంకకు చెందిన ఆటోడ్రైవర్(62) జూలై 30న పరీక్ష
పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఆత్మహత్య
పి.గన్నవరం(తూర్పు గోదావరి జిల్లా): పాజిటివ్ వచ్చిన వ్యక్తి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని మొండెపులంకకు చెందిన ఆటోడ్రైవర్(62) జూలై 30న పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. హోంక్వారంటైన్లో ఉంటానని చెప్పడంతో వైద్యులు కిట్ ఇచ్చి వాడే విధానం తెలిపారు. అతడు ఇంటి రెండో అంతస్థులో ఉంటున్నాడు. కుటుంబసభ్యులు పిలిచినా స్పందన లేకపోవడంతో తలుపులు తీసి చూసేసరికి అతడు ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. సోదరుడు అన్నవరం ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.