చికెన్‌ తింటే ‘కరోనా’ రాదు

ABN , First Publish Date - 2020-03-13T09:14:47+05:30 IST

చికెన్‌, మటన్‌ తినడం వల్ల కరోనా సోకుతుందనే పుకార్లు నమ్మవద్దని పశు సంవర్ధక శాఖ జేడీ డాక్టర్‌ ఎన్‌టీ శ్రీనివాసరావు కోరారు. ఉడకబెట్టిన

చికెన్‌ తింటే ‘కరోనా’ రాదు

అపోహలు నమ్మొద్దు  నిర్భయంగా తినొచ్చు

పశుసంవర్ధక శాఖ జేడీ ఎన్‌టీ శ్రీనివాసరావు 


కాకినాడ, మార్చి12(ఆంధ్రజ్యోతి): 

చికెన్‌, మటన్‌ తినడం వల్ల కరోనా సోకుతుందనే పుకార్లు నమ్మవద్దని పశు సంవర్ధక శాఖ జేడీ డాక్టర్‌ ఎన్‌టీ శ్రీనివాసరావు కోరారు. ఉడకబెట్టిన మాంసం, గుడ్లు తినడం ద్వారా పాలు తాగడం వల్ల ఈ వ్యాధి సోకుతుందనే ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లను నమ్మవద్దని సూచించారు. మాంసం, గుడ్లు, పాలు ఎప్పటిలాగే తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ఏమైనా అనుమానాలుంటే  తమ శాఖ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 085 0000 1962లో సంప్రదించవచ్చన్నారు.

Updated Date - 2020-03-13T09:14:47+05:30 IST