కరోనా కలకలం
ABN , First Publish Date - 2020-03-16T09:08:55+05:30 IST
రాజానగరం మండలం కొండగుంటూరు గ్రామంలో ఆదివారం కరోనా కలకలం రేగింది. గ్రామానికి చెందిన ఒక యువకుడికి కరోనా లక్షణాలు
కొండగుంటూరులో..
అబూదబీ నుంచి వచ్చిన యువకుడికి కరోనా అనుమానం
దివాన్‌చెరువు, మార్చి 15:
రాజానగరం మండలం కొండగుంటూరు గ్రామంలో ఆదివారం కరోనా కలకలం రేగింది. గ్రామానికి చెందిన ఒక యువకుడికి కరోనా లక్షణాలు కనిపించడంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీంతో అప్రమత్తమైన వైద్యఆరోగ్యశాఖ కొండగుంటూరులో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. పెద్దసంఖ్యలో తమ గ్రామానికి తరలివచ్చిన వైద్యసిబ్బందిని చూసి గ్రామస్థులు కలవరపాటుకు లోనయ్యారు. దీనికి సంబంధించి రాజానగరం పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ టి.రవికుమార్ తెలిపిన వివరాలివి.
అబూదబీనుంచి స్వగ్రామమైన కొండగుంటూరుకు ఈనెల 3న వచ్చిన యువకుడికి ఈనెల 11 నుంచి జలుబు, దగ్గు రావడంతో 12న కాకినాడలోని జీజీహెచ్‌లోని ఐసోలేషన్ వార్డుకు తరలించి వైద్యపరీక్షలు చేస్తున్నామన్నారు. యువకుడి కుటుంబసభ్యులు ఆరోగ్యంగానే ఉన్నారన్నారు. కొండగుంటూరులోని యువకుడి ఇంటి మొత్తానికి ఐసోక్లొరీ సొల్యూషన్ చేశామని, పరిసరాల్లోని అన్ని వీధులతో బ్లీచింగ్ చల్లించామన్నారు. కేశవరం పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ శ్రీవల్లీ పాల్గొన్నారు.