మిఠాయి వ్యాపారులు నిబంధనలు పాటించాలి

ABN , First Publish Date - 2020-10-07T09:17:17+05:30 IST

మిఠాయిల తయారీలో కల్తీలు జరిగితే సహించేదిలేదని జిల్లా ఆహార నియంత్రణ తనిఖీ అధికారి బి.శ్రీనివాస్‌ వ్యాపారులను హెచ్చరించారు...

మిఠాయి వ్యాపారులు నిబంధనలు పాటించాలి

మండపేట, అక్టోబరు 6: మిఠాయిల తయారీలో కల్తీలు జరిగితే సహించేదిలేదని జిల్లా ఆహార నియంత్రణ తనిఖీ అధికారి బి.శ్రీనివాస్‌ వ్యాపారులను హెచ్చరించారు. మండపేటలోని పలు మిఠాయి దుకాణాల్లో ఆయన తనిఖీలు నిర్వహించారు. ఈవిషయం తెలియడంతో ముందుగానే  పలువురు వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో చాలా దుకాణాలకు ఆహారనియంత్రణ శాఖ జారీచేసిన రిజిస్ట్రేషన్లు లేవన్నారు. తమ శాఖ నుంచి తప్పనిసరిగా ధ్రువీకరణ పత్రం పొందాలన్నారు. స్వీట్లు ఎప్పుడు తయారుచేసింది తేదీలు ప్రదర్శించాలని, లేకపోతే చర్యలు తప్పవన్నారు.

Read more