సీనియర్‌ న్యాయవాది మృతికి సంతాపం

ABN , First Publish Date - 2020-10-07T09:12:17+05:30 IST

కాకినాడకు చెందిన సీనియర్‌ న్యాయవాది ఎంవీవీ సత్యనారాయణ మృతికి న్యాయవాదులు, విశ్వజన కళా మండలి సంతాపం తెలిపింది...

సీనియర్‌ న్యాయవాది మృతికి సంతాపం

ముమ్మిడివరం, అక్టోబరు 6: కాకినాడకు చెందిన సీనియర్‌ న్యాయవాది ఎంవీవీ సత్యనారాయణ మృతికి న్యాయవాదులు, విశ్వజన కళా మండలి సంతాపం తెలిపింది. స్థానిక పోలమ్మ చెరువుగట్టున జైబుద్ధ పార్కులో వడ్డి నాగేశ్వరరావు అధ్యక్షతన మంగళవారం విశ్వజన కళామండలి సమావేశం జరిగింది.  సత్యనారాయణ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తటవర్తి నాగరాజారావు, దున్నా సుబ్బారావు, కేఎల్‌వీ ప్రసాద్‌, గోనమండ వెంకటేశ్వరరావు  పాల్గొన్నారు.

Read more