సచివాలయాల్లో కమిషనర్‌ తనిఖీలు

ABN , First Publish Date - 2020-10-25T05:09:22+05:30 IST

భారీ వర్షాల కారణంగా కాకినాడ నగరంలో ముంపు బారిన పడిన 23, 25, 37, 38, 42, 48, 49 ప్రాంతాల్లోని సచివాలయాల్లో కమిషనర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌ శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

సచివాలయాల్లో కమిషనర్‌ తనిఖీలు

  • బాధితుల జాబితా ప్రదర్శించని పలువురికి షోకాజ్‌లు

కార్పోరేషన్‌(కాకినాడ) అక్టోబరు, 24: భారీ వర్షాల కారణంగా కాకినాడ నగరంలో ముంపు బారిన పడిన 23, 25, 37, 38, 42, 48, 49 ప్రాంతాల్లోని సచివాలయాల్లో కమిషనర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌ శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముంపు బాధితుల జాబితా పూర్తి చేయని కారణంగా రెవెన్యూ కార్యదర్శులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ బాధితులకు తక్షణం సాయంగా రేషన్‌బియ్యం అందించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇందులో నిర్లక్ష్యం పనికిరాదని చెప్పారు.

Updated Date - 2020-10-25T05:09:22+05:30 IST