-
-
Home » Andhra Pradesh » East Godavari » college fee
-
కళాశాల ఫీజు గడువు పొడిగించాలి
ABN , First Publish Date - 2020-12-30T05:51:31+05:30 IST
పీఆర్ డిగ్రీ కళాశాల ఫీజు గడువు పొడిగించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మంగళవారం ప్రిన్సిపాల్ చప్పిడి కృష్ణను వినతిపత్రం అందజేశారు.

డెయిరీఫారమ్ సెంటర్(కాకినాడ), డిసెంబరు 29: పీఆర్ డిగ్రీ కళాశాల ఫీజు గడువు పొడిగించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మంగళవారం ప్రిన్సిపాల్ చప్పిడి కృష్ణను వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షుడు పి.తారకేష్ మాట్లాడుతూ పీఆర్ కళాశాలలో సుమారు 2500 మంది విద్యనభ్యసిస్తున్నారన్నారు. అందులో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, వెనుకబడిన తరగతుల విద్యార్థులేనన్నారు. కళాశాల ఫీజు చెల్లించేందుకు వారం రోజుల మాత్రమే గడువు ఇవ్వడంతో ఆందోళన చెందుతున్నారన్నారు. కరోనా కాలంలో గ్రామాల్లో ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ప్రభుత్వం ఫీజులు రద్దు చెయ్యడం మానేసి ముక్కు పిండి వసూలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై ప్రిన్సిపాల్ స్పందిస్తూ జనవరి 2 వరకు ఫీజు కట్టే అవకాశం ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సూర్య, విశ్వ, దినేష్, కళాశాల నాయకుడు అరుణ్ పాల్గొన్నారు.