లింగ నిర్ధారణ నియంత్రణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి

ABN , First Publish Date - 2020-10-31T06:12:37+05:30 IST

జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టం పటిష్టంగా అమలయ్యేలా చూడాలని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

లింగ నిర్ధారణ నియంత్రణ  చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి

కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి ఆదేశం
డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), అక్టోబరు 30: జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టం పటిష్టంగా అమలయ్యేలా చూడాలని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి జిల్లా స్థాయి మల్టీ మెంబర్‌ అప్రాప్రియట్‌ అఽథారిటీ (పీసీ అండ్‌ పీఎస్‌డీటీ యాక్ట్‌) సమావేశాన్ని శుక్రవారం జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించారు. జిల్లాలో ఎక్కడా చట్ట ఉల్లంఘన జరగకుండా అధికారులు చూడాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టంపై అవగాహన కల్పించాలన్నారు. స్కానింగ్‌ కేంద్రాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి 7, రెన్యువల్‌ కోసం 24 దరఖాస్తులు రాగా, పూర్తిస్థాయి తనిఖీల అనంతరం వాటికి ఆమోదం తెలిపామన్నారు. కొవిడ్‌-19 కారణంగా తనిఖీల ప్రక్రియలో జాప్యం జరిగినప్పటికీ, ఇకపై నిశిత పరిశీలన, తనిఖీలతో పాటు డెకాయ్‌ ఆపరేషన్స్‌ పైన దృష్టి సారించాలని సూచించారు.  డీఎంహెచ్‌వో డాక్టర్‌ కేవీఎస్‌ గౌరీశ్వరరావు, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.రాఘవేంద్రరావు, కాకినాడ ఆర్‌డీవో ఏజీ చిన్నికృష్ణ, రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ అనుపమ అంజలి, అమలాపురం సబ్‌ కలెక్టర్‌ హిమాన్షు కౌశిక్‌ పాల్గొన్నారు.
 

Updated Date - 2020-10-31T06:12:37+05:30 IST