తహశీల్దార్‌పై కలెక్టర్ ఆగ్రహం!
ABN , First Publish Date - 2020-10-19T06:03:33+05:30 IST
కాకినాడ, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): కాకినాడ అర్బన తహశీల్దార్ సతీష్ పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరంలో నీట మునిగిన లోతట్టు

కాకినాడ, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): కాకినాడ అర్బన తహశీల్దార్ సతీష్ పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరంలో నీట మునిగిన లోతట్టు ప్రాంతాల ప్రజలకు భోజన ఏర్పాట్లలో ఆయన విఫలమవ్వడంతో కలెక్టర్ ఆగ్రహానికి గురయ్యారని తెలిసింది. నాలుగు రోజు ల నుంచి ముంపునీటిలో తాము పడుతున్న అవస్థలను బాధితులు సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి వివరించగా ఆయన విషయాన్ని కలెక్టర్‌కు చెప్పారు. పాతబస్టాండ్, ట్రెజరీకాలనీ, ప్రతా్‌పనగర్, పప్పులమిల్లు, దుమ్ములపేట, పర్లోపేట ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వీరికి భోజన ఏర్పాట్లు చూస్తానన్న తహశీల్దార్ చేతులెత్తేశారు. ఇదిలా ఉంటే ముంపు బాధితులకు భోజనాలు సమకూర్చడానికి నగరంలో ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ యాజమాన్యంతో ఒప్పందం చేసుకున్నప్పటికీ నాలుగు రోజులుగా ఎందుకు భోజనాలు పెట్టలేదనేది తెలియాల్సి ఉంది. అలాగే పలువురు రేషన డీలర్ల వద్ద బియ్యం కూడా సేకరించారని విశ్వసనీయ సమాచారం.