కొవిడ్‌ వ్యాక్సిన్‌ స్టోరేజీకి ఏర్పాట్లు సిద్ధం చేయాలి

ABN , First Publish Date - 2020-12-05T06:20:39+05:30 IST

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), డిసెంబరు 4: జిల్ల్లాలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ స్టోరేజీకి అవసరమైన అన్ని ఏర్పా ట్లు సిద్ధం చేయాలని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి జిల్లా వైద్య అధికారులను ఆదేశించారు. అంబేద్కర్‌ భవన్‌ సమీపంలో గల జిల్లా సెంట్రల్‌ మెడిసిన్‌ స్టోర్‌ను శుక్రవారం జాయింట్‌ కలెక్టర్‌

కొవిడ్‌ వ్యాక్సిన్‌ స్టోరేజీకి ఏర్పాట్లు సిద్ధం చేయాలి
జిల్లా సెంట్రల్‌ మెడిసిన్‌ స్టోర్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌

కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి 

జిల్లా సెంట్రల్‌ మెడిసిన్‌ స్టోర్‌ పరిశీలన

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), డిసెంబరు 4: జిల్ల్లాలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ స్టోరేజీకి అవసరమైన అన్ని ఏర్పా ట్లు సిద్ధం చేయాలని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి జిల్లా వైద్య అధికారులను ఆదేశించారు. అంబేద్కర్‌ భవన్‌ సమీపంలో గల జిల్లా సెంట్రల్‌ మెడిసిన్‌ స్టోర్‌ను శుక్రవారం జాయింట్‌ కలెక్టర్‌ చేకూరి కీర్తితో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. సెంట్రల్‌ మెడిసిన్‌ స్టోరేజీలో కోల్డ్‌ స్టోర్‌రూమ్‌, కూలర్ల సామర్ధ్యం, విద్యుత్‌ సౌకర్యం ఇతర అంశాలపై వైద్యాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో తొలిదశగా సుమారు 40 వేలమంది హెల్త్‌కేర్‌ వర్కర్లకు అవసరమైన కొవిడ్‌ వ్యాక్సి న్‌కు జిల్లాకు రానుందన్నారు. వ్యాక్సిన్‌ స్టోరేజీకి ఎటువంటి సమస్యలు ఏర్పడకుండా అవసరమైన వ్యాక్యూం కోల్డ్‌ స్టోరేజీ, పెద్ద ఐఎల్‌ఆర్‌లు, ఇతర సదుపాయాలన్నీ సిద్ధం చేయాలని సూచించారు. జిల్లాలో వ్యాక్సిన్‌ స్టోరేజీ, పంపిణీకి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని వైద్య అధికారులకు కలెక్టర్‌ సూచించారు. పరిశీలనలో జిల్లా వైద్య ఆరోగ్యాధికారి కేవీఎస్‌ గౌరీశ్వరరావు, ఏపీఎంఎ్‌సఐడీసీ ఈఈ కేసీతారామరాజు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 

సిమెంట్‌ సరఫరాకు ఆటంకం రాకూడదు

ఎట్టి పరిస్థితుల్లో 2021 మార్చి 31 నాటికి గ్రామ వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ ఆరోగ్య కేంద్రాలకు శాశ్వత భవన నిర్మాణాలు పూర్తికావాల్సి ఉం దని... ఇందుకు అవసరమైన సిమెంట్‌ సరఫరాకు ఆటంకం లేకుండా చూడాలని కలెక్టర్‌ డిమురళీధర్‌రెడ్డి సిమెంట్‌ కంపెనీల ప్రతినిధులకు సూచించారు. కలెక్టరేట్‌లోని కోర్టుహాల్‌లో 8 సిమెంట్‌ కంపెనీల ప్రతినిధులు, ఇంజనీరింగ్‌ అధికారులతో కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు సుమారు లక్ష మెట్రిక్‌ టన్నుల సిమెంట్‌కు ఇండెంట్‌ ఇవ్వగా 50 శాతం మేర మాత్రమే సరఫరా చేశారన్నారు. మిగిలిన సిమెంట్‌ తక్షణం సరఫరా చేయాలని కోరారు. జేసీ జిరాజకుమారి మాట్లాడుతూ ప్రధాన కార్యాలయాల దగ్గర నుంచి క్షేత్రస్థాయి వరకు సమన్వయంతో వ్యవహరిస్తూ లక్ష్యాల మేరకు సిమెంట్‌ సరఫరా జరిగేలా చూడాలని సిమెంట్‌ కంపెనీల ప్రతినిధులకు సూచించారు. సమావేశంలో పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ ఎంనాగరాజు, గ్రామీణ నీటి సరఫరా ఎస్‌ఈ టిగాయత్రిదేవి, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-05T06:20:39+05:30 IST