గ్రామాల్లో కోడ్‌ ఉల్లంఘన

ABN , First Publish Date - 2020-03-18T09:23:40+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కోడ్‌ అమలులో ఉన్నప్పటికీ వలంటీర్లు ద్వారా పథకాలు

గ్రామాల్లో కోడ్‌ ఉల్లంఘన

నిబంధనలకు విరుద్ధంగా రేషన్‌ కార్డుల పంపిణీ


ఆత్రేయపురం, మార్చి 17: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కోడ్‌ అమలులో ఉన్నప్పటికీ వలంటీర్లు ద్వారా పథకాలు అందజేస్తున్నారన్న ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. పలుచోట్ల  కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడుతున్నా ఎన్ని కల అధికారులు చూసీచూడనట్టు వ్యవ హరిస్తూ అధికారపార్టీ కొమ్ము కాస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నా యి. ప్రస్తుతం ఎన్నికలు నిలుపుదల చేసినా కోడ్‌ అమలులోనే ఉంది. కొత్తగా మంజూరైన రేషన్‌ కార్డులను సోమ వారం పలు గ్రామాల్లో వలంటీర్ల ద్వారా పంపిణీ కార్యక్రమం గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు.


అంకంపాలెంలో వలంటీర్లు కార్డులు పంపిణీ చేస్తుండగా స్థానిక తెలుగుదేశంపార్టీ నాయకులు అడ్డుకుని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. అలాగే మిగిలిన గ్రామాల్లో  కూడా వలంటీర్లు ఇంటింటికీ వెళ్ళిరేషన్‌ కార్డుల పంపిణీ నిర్వహించారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి ప్రభుత్వ పఽథకాలు పంపిణీ చేయడంపై ప్రతిపక్షాలు ఎన్నికల అధి కారులకు ఫిర్యాదు చేశారు. కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడిన వలంటీర్లుపై చర్యలు చేపట్టాలని వివిధ పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. అలాగే ఇళ్ళస్థలాల పంపిణీకి చర్యలు చేపడుతున్నారని దేశం శ్రేణులు ఆరోపిస్తున్నారు. 

Updated Date - 2020-03-18T09:23:40+05:30 IST