కొబ్బరిపీచు పరిశ్రమలు కుదేలు

ABN , First Publish Date - 2020-12-06T07:02:57+05:30 IST

కొవిడ్‌ అనంతర పరిస్థితుల్లో జిల్లాలో కొబ్బరి ఆధారిత పరిశ్ర మలు కుదేలవుతున్నాయి.

కొబ్బరిపీచు పరిశ్రమలు కుదేలు

కొబ్బరికాయల ఉత్పత్తి దిగుబడి తగ్గడమే కారణం

డొక్క కొరతతో ముందుకుసాగని పీచు పరిశ్రమలు

జిల్లాలో వెయ్యికిపైగా పరిశ్రమలకు తీవ్ర నష్టాలు

 

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

కొవిడ్‌ అనంతర పరిస్థితుల్లో జిల్లాలో కొబ్బరి ఆధారిత పరిశ్ర మలు కుదేలవుతున్నాయి. పరిశ్రమలకు కావాల్సిన కొబ్బరి ముడి సరుకు లభ్యం కాకపోవడం, ఇతర ప్రాంతాలకు పీచు ఉత్పత్తుల ఎగుమతులు నిలిచిపోవడం, ఉత్పాదక వ్యయం గణనీయంగా పెరిగిపోవడంతో పీచు పరిశ్రమల ఉత్పత్తులు స్తంభించిపోతు న్నాయి. దీనికితోడు పీచు పరిశ్రమలు ఉత్పత్తిచేసే వస్తువులకు ధరల పెరుగుదల లేకపోవడం ఒక కారణంగా కనిపిస్తోంది. జిల్లాలో చిన్నా, మధ్యతరహా, భారీ కొబ్బరి పీచు పరిశ్రమలు వెయ్యి వరకు ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో పది వేల మందికిపైగా కార్మికులు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఉపాధి పొందుతున్నారు. వరుస ప్రకృతి వైపరీత్యాల కారణంగా కొబ్బరి కాయల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. దీని కారణంగా ఇతర ప్రాంతాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. డొక్క కొరత కూడా పరిశ్రమలను వేధిస్తోంది. దీంతోపాటు ఈ ఏడాది మార్చి నుంచి కొవిడ్‌ కార ణంగా పరిశ్రమలు పనిచేయలేదు. ఇక కొబ్బరి పీచు పరిశ్రమల ద్వారా తాళ్లు, పగ్గాలు, పీచు బేళ్లు వంటివి తయారవుతా యి. అయితే పీచుకు గత పది సంవత్సరాల కిందట ఎంత ధర ఉందో ఇప్పుడు కూడా టన్ను రూ.8,500 మాత్రమే ఉంది. ఉత్పాదక వ్యయమెంత పెరుగుతున్నా ఉత్పత్తి అయిన పీచు ధర లో ఎలాంటి మార్పు లేదని రాణీ శ్రీనివాస్‌శర్మ అనే య జమాని ఆవేదన చెందారు. ప్రస్తుతం హైదరాబాద్‌కు తాళ్ల ఎగుమతి ఇప్పుడే ప్రా రంభమైంది. కానీ గతంలో వంద తాళ్ల కట్ట రూ.200 ఉంటే ఇప్పుడు దాని ధర రూ.150కు తగ్గింది. దీంతో పీచు పరిశ్రమ లకు తగిన ప్రోత్సాహకాలు అందించి ఆ దుకోవాలని యజమానులు కోరుతున్నారు.



Updated Date - 2020-12-06T07:02:57+05:30 IST