కొబ్బరి పంట ప్రాముఖ్యతను గుర్తించాలి

ABN , First Publish Date - 2020-12-19T06:53:33+05:30 IST

కొబ్బరి, ఇతర ఉద్యానపంటల ప్రాముఖ్యం, సాగులో నూతన సాంకేతిక పద్ధతులపై రైతులు అవగాహన పెంచుకోవాలని అంబాజీపేట ఉద్యాన పరిశోధనాస్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ డీవీకే భగవాన్‌ పేర్కొన్నారు.

కొబ్బరి పంట ప్రాముఖ్యతను గుర్తించాలి

కొత్తపేట, డిసెంబరు 18: కొబ్బరి, ఇతర ఉద్యానపంటల ప్రాముఖ్యం, సాగులో నూతన సాంకేతిక పద్ధతులపై రైతులు అవగాహన పెంచుకోవాలని అంబాజీపేట ఉద్యాన పరిశోధనాస్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ డీవీకే భగవాన్‌ పేర్కొన్నారు. శుక్రవారం  అవిడి శివారు చప్పిడివారిపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో మనగ్రామం-మన విశ్వవిద్యాలయం కార్యక్రమంలో భాగంగా ఉన్నత పాఠశాల ఆవరణలో కొబ్బరి మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. ఈసందర్భంగా భగవాన్‌ మాట్లాడుతూ  కొబ్బరి ప్రాముఖ్యతను రైతులు గుర్తెరగాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ చలపతిరావు, కిరీటి, ఉద్యాన అధికారి అమరనాధ్‌, పాఠశాల హెచ్‌ఎం ఎ.వెంకటేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు.Read more