ఒలుపు, దింపు కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2020-11-19T06:34:00+05:30 IST

ఒలుపు, దింపు కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని ఒలుపు, దింపు కార్మికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొడ్డపల్లి నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

ఒలుపు, దింపు కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలి

మామిడికుదురు, నవంబరు 18: ఒలుపు, దింపు కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని ఒలుపు, దింపు కార్మికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొడ్డపల్లి నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. మామిడికుదురు మండల దింపు, ఒలుపు కార్మికుల నూతన సంఘాన్ని బుధవారం ఏఎంసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎన్నుకున్నారు. మండలశాఖ అధ్యక్షుడు గుబ్బల కృష్ణమూర్తి, ఉపాధ్యక్షుడిగా గిడుగు శేషగిరిరావు, సెక్రటరీగా విప్పర్తి శ్రీనివాసరావు,  ఆరుగురు  సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో పెచ్చెట్టి వీరవెంకటసత్యనారాయణ, జోగి ఏడుకొండలు, చిర్రా శ్రీనివాసరావు, కాండ్రేగుల నాగబాబు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-19T06:34:00+05:30 IST