కొబ్బరి తోటల్లో అంతర పంటలతో ఆదాయం

ABN , First Publish Date - 2020-11-06T06:26:12+05:30 IST

అప్పనరామునిలంక గ్రామం రైతుభరోసా కేంద్రం వద్ద మిషన ఫర్‌ కిసాన ద్వారా రైతుల కోసం స్మార్ట్‌విలేజ్‌ మూమెంట్‌ బృందం ఆధ్వర్యంలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు.

కొబ్బరి తోటల్లో అంతర పంటలతో ఆదాయం

అంతర్వేది, నవంబరు 5: అప్పనరామునిలంక గ్రామం రైతుభరోసా కేంద్రం వద్ద మిషన ఫర్‌ కిసాన ద్వారా రైతుల కోసం స్మార్ట్‌విలేజ్‌ మూమెంట్‌ బృందం ఆధ్వర్యంలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు.  ముఖ్యఅతిథిగా ఎస్‌వీఎం స్టేట్‌ డైరెక్టర్‌ వై.ఎస్‌.మైఖేల్‌ మాట్లాడారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వ్యవ సాయ రంగ బిల్లులవల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు, కొబ్బరి తోటల్లో అంతర పంటల సాగు ద్వారా అదనంగా ఆదాయం ఎలా పొందవచ్చో వివరించారు.  కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్లు గంటా సునీల్‌, శశాంక, శ్రీదత్త, విలేజ్‌ వీఏఏ తోటే కరుణాకర్‌, ప్రకృతి వ్యవసాయాధికారులు మురళీ, జమలయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-06T06:26:12+05:30 IST