-
-
Home » Andhra Pradesh » East Godavari » cm office secretary praveen prakash
-
పేదలందరికీ సొంతిళ్లు
ABN , First Publish Date - 2020-12-27T06:18:01+05:30 IST
కాకినాడ, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): పేదలందరికీ సొంతిళ్లు ఉండాలనే లక్ష్యంగా ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తోందని సీఎం కార్యాలయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ తెలి పారు. 41,46 డివిజన్లలో లబ్ధిదారుల ఇళ్లకు ఆయన వెళ్లి పలువురికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. పట్టాలు జారీ చేసే

సీఎం కార్యాలయ ప్రధాన కార్యదర్శి
కాకినాడ, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): పేదలందరికీ సొంతిళ్లు ఉండాలనే లక్ష్యంగా ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తోందని సీఎం కార్యాలయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ తెలి పారు. 41,46 డివిజన్లలో లబ్ధిదారుల ఇళ్లకు ఆయన వెళ్లి పలువురికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. పట్టాలు జారీ చేసే ప్రక్రియలో ఆయా సచివాలయాల్లో అందిస్తున్న వివిధ సేవలను తెలుసుకున్నారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి గృహ నిర్మాణాలను ఎలా చేపట్టాలనే విధానాన్ని వివరించా రు. ఆయన వెంట స్పెషల్ కమిషనర్ ఫర్ హౌస్ సైట్స్ హరినారాయణ, నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ ఉన్నారు.