సీఎం జగన్‌ది తుగ్లక్ పాలన: రాజప్ప
ABN , First Publish Date - 2020-05-24T10:16:22+05:30 IST
రాష్ట్రంలో జగన్ పరిపాలనా విధానం తుగ్లక్ పాలనను తలపిస్తోందని మాజీ డిప్యూటీ సీఎం, పెద్దాపురం ఎమ్మెల్యే ..

డెయిరీఫారమ్ సెంటర్ (కాకినాడ), మే 23: రాష్ట్రంలో జగన్ పరిపాలనా విధానం తుగ్లక్ పాలనను తలపిస్తోందని మాజీ డిప్యూటీ సీఎం, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడాది పాలనలో 63 తప్పులు చేసి హైకోర్టుకు వెళ్లి అనేక వివాదాస్పద విషయాల్లో మొట్టికాయలు తిన్న ఏకైన సీఎం జగన్ అని పేర్కొన్నారు. ఏడాదిలో ఒక రూపాయి కూడా అభివృద్ధికి ఖర్చుపెట్టిన దాఖలాలు లేవన్నారు. లాక్డౌన్ పేరుతో కోట్లాది రూపాయలు దోచుకుతిన్నారన్నారు. రాష్ట్రంలో ఇసుక, మట్టి, మద్యం మాఫియాలు విపరీతంగా పెరిగాయన్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం అన్యాయమని ఆయన విమర్శించారు.