స్పందన మెరుగవ్వాలి

ABN , First Publish Date - 2020-11-19T06:20:08+05:30 IST

ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఉన్న స్పందన కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయాలని సీఎం జగన్‌ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.

స్పందన మెరుగవ్వాలి
సీఎం వీసీలో కలెక్టరేట్‌ నుంచి పాల్గొన్న కలెక్టర్‌

 జిల్లా యంత్రాంగానికి సీఎం జగన్‌ ఆదేశం
కాకినాడ, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఉన్న స్పందన కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయాలని సీఎం జగన్‌ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.  అమరావతి నుంచి నిర్వహించిన వీసీలో ఈ మేరకు సీఎం కలెక్టర్‌కు పలు సూచనలు జారీ చేశారు. ప్రస్తుత కొవిడ్‌ వైరస్‌ పరిస్థితుల్లో ప్రజలు నేరుగా అధికారులను కలిసి సమస్యలు విన్నవించుకోడానికి వీలు లేనందున, దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా నమోదవుతున్న సమస్యలను ఎప్పటికపుడు సకాలంలో పరిష్కరించాలన్నారు. దీనిపై కలెక్టర్‌ మాట్లాడుతూ ఆన్‌లైన్‌ లో వస్తున్న విజ్ఞప్తులను ఎప్పటికపుడు ఆయా శాఖాధిపతులకు పంపుతున్నామని సీఎంకు వివరించారు. పౌర సేవల విషయంలో ప్రతినిత్యం మానిటరింగ్‌ చేస్తున్నామన్నారు. వీసీలో జేసీలు డాక్టర్‌ లక్ష్మీశ, సీహెచ్‌ కీ ర్తి, డీఆర్వో సీహెచ్‌ సత్తిబాబు పాల్గొన్నారు.
 
 
 


Updated Date - 2020-11-19T06:20:08+05:30 IST