పోలీసులపై పంజా!

ABN , First Publish Date - 2020-09-14T10:08:49+05:30 IST

పోలీస్‌ బాస్‌లను కరోనా మహమ్మారి విడిచిపెట్టలేదు. కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తున్న పోలీసు అధికా రులు కనిపించని శత్రువుతో పోరాటం చేయాల్సి

పోలీసులపై పంజా!

అంతర్వేది బందోబస్తుకు వెళ్లిన ఎస్పీ, అదనపు ఎస్పీ, రాజోలు సీఐ, ఐదుగురు ఎస్‌ఐలు సహా పలువురు సిబ్బందికి పాజిటివ్‌ నిర్ధారణ

కొవిడ్‌-19 బారిన రాష్ట్ర మాల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ అమ్మాజీ

కొత్తగా 1,414 కేసులు 8 మొత్తం 76,808కు చేరుకున్న బాధితుల సంఖ్య


(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

పోలీస్‌ బాస్‌లను కరోనా మహమ్మారి విడిచిపెట్టలేదు. కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తున్న పోలీసు అధికా రులు కనిపించని శత్రువుతో పోరాటం చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో కొవిడ్‌-19 బాధి తుల జాబితాలో చేరుతున్నారు. తాజాగా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి, అడ్మిన్‌ ఎస్పీ కరణం కుమార్‌లకు వైరస్‌ సోకింది. వీరిద్దరూ ఇటీవల అంతర్వేది రథం దగ్ధం ఘటన నేపథ్యంలో అక్కడ బందోబస్తు పరి శీలనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అల్లరి మూకలను చెదరగొట్టే ప్రయత్నం, వారిలో ఉన్న ఆగ్రహావేశాలను సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.


వారితో పాటు రాజోలు సీఐ దుర్గాశేఖరరెడ్డి, పలువురు సిబ్బంది కొవిడ్‌ బారిన పడ్డారు. రాష్ట్ర మాల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌, వైసీపీ రాజోలు నియోజకవర్గ ఇన్‌చార్జి అయిన పెదపాటి అమ్మాజీ కూడా ఇటీవల అంత ర్వేదిలో పర్యటించారు. ఆమెకు కూడా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. వీరంతా హోమ్‌ ఐసోలేషన్‌లో చికి త్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే జిల్లావ్యాప్తంగా గడచిన 24 గంటల్లో చేసిన కరోనా పరీక్షల్లో 1,414 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర హెల్త్‌ బులిటెన్‌ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు 76,808 కేసులు నమోదయ్యాయి. 64,256 మంది చికిత్స పొంది కోలుకున్నారు. 12,098 మంది యాక్టివ్‌ దశలో ఉన్నారు. తాజాగా మృతి చెందిన ఐదుగురితో కలిపి మృతుల సంఖ్య 454కు చేరింది.


కొవిడ్‌తో ఆరుగురు మృతి

జీజీహెచ్‌ (కాకినాడ)/అమలాపురం రూరల్‌/కె.గంగవరం:  కొవిడ్‌తో ఆరుగురు మృతి చెందారు. కరోనా వైరస్‌తో కాకినాడకు చెందిన 37 ఏళ్ల వ్యక్తి ఈ నెల 6న, 37 సంవత్సరాల వ్యక్తి ఈనెల 11న జీజీహెచ్‌లో చేరి చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతి చెందినట్టు నోడల్‌ అధికారి డాక్టర్‌ ఎం.కిరణ్‌ తెలిపారు. అమలాపురంలోని కిమ్స్‌ కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఇద్దరు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. కె.గంగవరం మండలం యండగండికి 55ఏళ్ల రేషన్‌ డీలర్‌, పామర్రుకు చెందిన 45ఏళ్ల వ్యక్తి కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారని వైద్యురాలు పార్వతి చెప్పారు.  

Updated Date - 2020-09-14T10:08:49+05:30 IST