విజయలక్ష్మి ఆశయ సాధనకు కృషి: మల్లాడి

ABN , First Publish Date - 2020-12-07T06:31:47+05:30 IST

ప్రముఖ కవయిత్రి, విశ్రాంతి అధ్యాపకురాలు కామవరపు విజయలక్ష్మి ఆశయ సాధనకు కృషి చేస్తానని పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు అన్నారు.

విజయలక్ష్మి ఆశయ సాధనకు కృషి: మల్లాడి

యానాం, డిసెంబరు 6: ప్రముఖ కవయిత్రి, విశ్రాంతి అధ్యాపకురాలు కామవరపు విజయలక్ష్మి ఆశయ సాధనకు కృషి చేస్తానని పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు అన్నారు. రోడ్డు ప్రమాదంలో కామవరపు విజయలక్ష్మి, భర్త, చిన్న కుమారుడు మృతి చెందడంతో ఆదివారం స్థానిక సర్యశిక్షాఅభియాన్‌ సమావేశ మందిరంలో సంస్మరణ సభ నిర్వహించారు. వారి చిత్ర పటాలకు మంత్రి మల్లాడి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా మంత్రి మల్లాడి మాట్లాడుతూ అన్ని రంగాల్లో ఎంతో ప్రతిభ ఉన్న వారి మరణం చాలా విచారకరమన్నారు. విజయలక్ష్మి లేకుండా ప్రజా ఉత్సవాలు ఇప్పటివరకు జరగలేదని, ఆమె లేనిలోటు తీరనిదని అన్నారు. విజయలక్ష్మి దంపతుల పెళ్లిరోజున ప్రతీ ఏటా ఒక కార్యక్రమం నిర్వహి స్తానని, దీనికి కుటుంబ సభ్యులు అభిప్రాయం తెలపాలన్నారు. ఈసందర్భంగా ఆర్‌ఏ శివరాజ్‌మీనా, విద్యాశాఖాధికారి కాలే సాయినాథ్‌, పంపన ప్రవీణ్‌, కవి దాట్ల దేవదానంరాజు, విజయలక్ష్మి కుటుంబ సభ్యులు, బ్రాహ్మ ణసేవా సంఘం సభ్యులు మాట్లాడారు. ఎంతో మంది పేదపిల్లలకు చదువు చెప్పించడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిం చారని వారితో ఉన్న అనుబంధాన్ని వివరించారు. సంస్మరణ సభ నిర్వహించడంపై విజయలక్ష్మి ప్రథమ కుమారుడు ప్రశాంత్‌ అందరికీ ధన్యవాదాలు తెలిపారు.



Updated Date - 2020-12-07T06:31:47+05:30 IST