కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ABN , First Publish Date - 2020-11-21T06:20:23+05:30 IST

కేంద్ర ప్రభుత్వ పథకాలను బీజేపీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కార్యకకర్తలకు పిలుపునిచ్చారు.

కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
మాట్లాడుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు సోము వీర్రాజు

రామచంద్రపురం, నవంబరు 20: కేంద్ర ప్రభుత్వ పథకాలను బీజేపీ కార్యకర్తలు ప్రజల్లోకి  తీసుకువెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కార్యకకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మానేపల్లి ఆయ్యాజీవేమా నేతృత్వంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఇళ్ల  వేంకటేశ్వరరావు అధ్యక్షతన రామచంద్రపురం నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల శిక్షణా తరగతులు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సోము వీర్రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రం తన పథకాలుగా ప్రచారం చేసుకుంటుందన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసే బాధ్యత కేంద్రం తీసుకుంటుందని ఆయన చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సమాయత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు. మానేపల్లి అయ్యాజీ వేమా మాట్లాడుతూ పార్టీ బలోపేతానకి కార్యకర్తలు కృషి చేయాలన్నారు.  ఈసమావేశానికి రామచంద్రపురం, కాజులూరు, కె.గంగవరం మండలాల నుంచి కార్యకర్తలు పాల్గొన్నారు.  కార్యక్రమంలో బీజేపీ నేతలు యాళ్ల దొరబాబు, సుబ్బారావు, యాండ్ర బుల్లబ్బులు, సత్యవాడ  శ్రీహరిపంతులు పాల్గొన్నారు. తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన  వీర్రాజును బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరావు నేతృత్వంలో సత్కరించారు.  


Read more