సెల్‌ఫోన్‌ షాపులో చోరీ

ABN , First Publish Date - 2020-11-27T06:54:25+05:30 IST

ద్రాక్షారామలో తేజ సెల్‌ఫోన్‌ షాపులో బుధవారం రాత్రి చోరీ జరిగింది. కె.గంగవరం మండలం కుందూరుకు చెందిన దాకమూరి సురేష్‌ ద్రాక్షారామలో సెల్‌ఫోన్‌ షాపు నిర్వహిస్తున్నాడు.

సెల్‌ఫోన్‌ షాపులో చోరీ

ద్రాక్షారామ, నవంబరు 26: ద్రాక్షారామలో తేజ సెల్‌ఫోన్‌ షాపులో బుధవారం రాత్రి చోరీ జరిగింది. కె.గంగవరం మండలం కుందూరుకు  చెందిన దాకమూరి సురేష్‌  ద్రాక్షారామలో సెల్‌ఫోన్‌ షాపు నిర్వహిస్తున్నాడు. సురేష్‌ బుధవారం రాత్రి షాపు మూసి వెళ్లిపోయాడు. గురువారం ఉదయం వచ్చి షాపు తెరిచేసరికి షాపు పైకప్పు పెకలించి ఉంది. గుర్తుతెలియని వ్యక్తి రూ.1.38,000 విలువైన 9 సామ్‌సంగ్‌, వివో ఇతర కంపెనీల మొబైల్స్‌ అపహరించాడు.  ద్రాక్షారామ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి పాల్పడిన వ్యక్తి ముసుగు వేసుకుని ఉన్నట్టు సీసీ కెమెరాలో రికార్డు అయింది.


Read more