బీచ్‌రోడ్‌ను పరిశీలించిన అర్‌అండ్‌బీ చీఫ్‌ ఇంజనీర్‌

ABN , First Publish Date - 2020-10-21T06:09:36+05:30 IST

భారీ వర్షాలు, తుఫాన్‌ కారణంగా సముద్ర కోతకు గురైన ఉప్పాడ బీచ్‌ రోడ్డును రోడ్లు, భవనాల శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ సురేష్‌ కుమార్‌ మంగళవారం రాత్రి పరిశీలించారు. తరచూ సముద్ర కెరటాల ధాటికి ఉప్పాడ గ్రామంతో పాటు బీచ్‌ రోడ్డు భారీ కోతకు గురవుతుందని ఎంపీ వంగా గీత సీఈకి వివరించారు.

బీచ్‌రోడ్‌ను పరిశీలించిన అర్‌అండ్‌బీ చీఫ్‌ ఇంజనీర్‌
ఉప్పాడ బీచ్‌రోడ్డులో వర్షం నీటినిపరిశీలిస్తున్న ఆర్‌అండ్‌బీ సీఈ సురేష్‌కుమార్‌

ఉప్పాడ(కొత్తపల్లి), అక్టోబరు 20: భారీ వర్షాలు, తుఫాన్‌ కారణంగా సముద్ర కోతకు గురైన ఉప్పాడ బీచ్‌ రోడ్డును రోడ్లు, భవనాల శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ సురేష్‌ కుమార్‌ మంగళవారం రాత్రి పరిశీలించారు. తరచూ సముద్ర  కెరటాల ధాటికి ఉప్పాడ గ్రామంతో పాటు బీచ్‌ రోడ్డు  భారీ కోతకు గురవుతుందని ఎంపీ వంగా గీత సీఈకి వివరించారు. ఉప్పాడ  బీచ్‌రోడ్డుకు శాశ్వత రక్షణ కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. బీచ్‌ రోడ్డు ఎంత మేర కోతకు గురైంది? శాశ్వత రక్షణకు ఎటువంటి చర్యలు చేపట్టాలనే విషయమై అధికారులు ప్రణాళిక రూపొందించాలని సీఈ ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు.  ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఉమ్మిడిజాన్‌, పలువురు మత్స్యకార నాయకులు ఆర్‌అండ్‌బీ సీఈ  ఆయన వెంట ఉన్నారు.

Updated Date - 2020-10-21T06:09:36+05:30 IST