బైక్‌ డిక్కీ నుంచి రూ.1.6 లక్షలు చోరీ

ABN , First Publish Date - 2020-12-25T06:11:59+05:30 IST

ఐస్‌క్రీమ్‌ పార్లర్‌ వద్ద పార్క్‌ చేసి ఉన్న బైక్‌ డిక్కీ నుంచి రూ.1.6 లక్షల నగదును దుండుగులు అపహరించారు. ప్రత్తిపాడు మండలం చినశంకర్లపూడికి చెందిన గోళ్ల ఆనందరావు జీడిమామిడి తోట పంట కొనుగోలు నిమిత్తం రైతులకు చెల్లించేందుకు గురువారం తన బైక్‌ డిక్కీలో రూ.లక్షా ఆరువేలు పెట్టి ఇంటి నుంచి బయలుదేరాడు.

బైక్‌ డిక్కీ నుంచి రూ.1.6 లక్షలు చోరీ

ఏలేశ్వరం, డిసెంబరు 24: ఐస్‌క్రీమ్‌ పార్లర్‌ వద్ద పార్క్‌ చేసి ఉన్న బైక్‌ డిక్కీ నుంచి రూ.1.6 లక్షల నగదును దుండుగులు అపహరించారు. ప్రత్తిపాడు మండలం చినశంకర్లపూడికి చెందిన గోళ్ల ఆనందరావు జీడిమామిడి తోట పంట కొనుగోలు నిమిత్తం రైతులకు చెల్లించేందుకు గురువారం తన బైక్‌ డిక్కీలో రూ.లక్షా ఆరువేలు పెట్టి ఇంటి నుంచి బయలుదేరాడు. ఏలేశ్వరం స్టేట్‌బ్యాంక్‌ సమీపంలోని వీరభద్ర  ఐస్‌క్రీమ్‌ పార్లర్‌ ఎదుట బైక్‌ పార్క్‌ చేశారు. షాపులో మంచినీరు తాగి బయటకు వచ్చేసరికి బైక్‌ డిక్కీ తాళాలు తెరిచి ఉన్నాయి, అందులో దాచి ఉంచిన నగదు కనిపించకపోవడాన్ని గుర్తించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ సంపత్‌కుమార్‌ సంఘటనా స్థలాన్ని, సమీంలోని దుకాణాలు వద్ద సీసీ టీవీ పుటేజ్‌ను పరిశీలించారు.  

Updated Date - 2020-12-25T06:11:59+05:30 IST