అధికారులపై కేసులు నమోదు చేయాలి

ABN , First Publish Date - 2020-05-10T09:17:15+05:30 IST

విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌ ప్లాంటు విస్తరణకు అనుమతిచ్చిన అధికారులపై కేసు నమోదు చేయాలని సీపీఐ (ఎంఎల్‌), ఏఐసీసీటీయూ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. యండపల్లి శివారు జొన్నల..

అధికారులపై కేసులు నమోదు చేయాలి

యండపల్లి (కొత్తపల్లి), మే 9: విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌ ప్లాంటు విస్తరణకు అనుమతిచ్చిన అధికారులపై కేసు నమోదు చేయాలని సీపీఐ (ఎంఎల్‌), ఏఐసీసీటీయూ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. యండపల్లి శివారు జొన్నల గరువులో  విశాఖ గ్యాస్‌ లీకేజీ బాధితులకు సంఘీభావంగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యుడు గొడుగు సత్యనారాయణ మాట్లాడుతూ ఎల్‌జీ పాలిమర్స్‌ ప్లాంటుకు 5 కిలోమీటర్ల పరిధిలో అన్ని కుటుంబాలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్లాంటు చుట్టూ జనావాసాలు ఉన్నప్పటికీ 2019లో విస్తరణకు అనుమతిచ్చిన అధికారులపై కేసులు నమోదు చేయాలన్నారు. 

Updated Date - 2020-05-10T09:17:15+05:30 IST