లాక్‌డౌన్‌కు సహకరించకపోతే కేసులు: ఆర్డీవో

ABN , First Publish Date - 2020-03-25T10:07:39+05:30 IST

లాక్‌డౌన్‌కు సహకరించాలని లేకపోతే వారిపై కేసులు నమోదు చేస్తామని రామచంద్రపురం ఆర్డీవో జి. గణేష్‌కుమార్‌ హెచ్చరించారు.

లాక్‌డౌన్‌కు సహకరించకపోతే కేసులు: ఆర్డీవో

బిక్కవోలు, మార్చి 24:  లాక్‌డౌన్‌కు సహకరించాలని లేకపోతే వారిపై కేసులు నమోదు చేస్తామని రామచంద్రపురం ఆర్డీవో జి. గణేష్‌కుమార్‌ హెచ్చరించారు. మంగళవారం బిక్కవోలులో ఆయన పర్యటిం చారు. ఉదయం ఆరు నుంచి 9 వరకు అత్యవసర పనుల నిమిత్తం  కుటుంబం నుంచి ఒకరు మాత్రమే బయటకు రావాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ రాజగోపాలరెడ్డి, తహశీల్దార్‌ వెంకటేశ్వరరావు ఉన్నారు.


ఈనెల 31 వరకు ఎవరూ బయటకు రావద్దని రెవెన్యూ, వలంటీర్లు గ్రామస్థులకు వివ రించారు. నూకాలమ్మ జాతర చేయకుండా ఆలయానికి పోలీసులు, పంచాయతీ సి బ్బంది తాళాలు వేశారు. రంగంపేట మండలంలో కొందరు వయస్సు పైబడిన వారు ఉపాధి హామీ పనులకు వెళుతున్నారు. తమకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు అందలేదని ఉపాధి హామీ అధికారులు తెలిపారు. 

Read more