విగ్రహాల ధ్వంసం కేసులో అనుమానితుడి గుర్తింపు

ABN , First Publish Date - 2020-09-25T01:47:51+05:30 IST

తూర్పుగోదావరి జిల్లా మండపేటలో ఏసుప్రభు, మరియమ్మ విగ్రహాల ధ్వంసం కేసులో అనుమానితుడిని పోలీసులు గుర్తించారు. ఈనెల 22న అర్ధరాత్రి

విగ్రహాల ధ్వంసం కేసులో అనుమానితుడి గుర్తింపు

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా మండపేటలో ఏసుప్రభు, మరియమ్మ విగ్రహాల ధ్వంసం కేసులో అనుమానితుడిని పోలీసులు గుర్తించారు. ఈనెల 22న అర్ధరాత్రి 11గంటలకు సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పద రీతిలో సంచరిస్తున్నట్లు సీసీ కెమెరా ద్వారా గురువారం పోలీసులు గుర్తించారు. 


మండపేట మెయిన్ రోడ్ ఆర్‌సీఎం చర్చి గేట్ బయట ఉన్న మేరిమాత, జీసస్ విగ్రహాలను మంగళవారం అర్ధరాత్రి ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు గురువారం కీలక ఆధారం సంపాదించారు.

Updated Date - 2020-09-25T01:47:51+05:30 IST