జీడిపప్పు కంపెనీపై కేసు నమోదు

ABN , First Publish Date - 2020-02-12T09:08:49+05:30 IST

ఆన్‌లైన్‌లో జీడిపప్పు ఆర్డర్‌ చేసి సరుకు ఇచ్చిన తర్వాత కొంత సొమ్ము ఇచ్చి మిగిలినది ఇవ్వకుండా మోసగించిన కంపెనీపై పిఠాపురం

జీడిపప్పు కంపెనీపై కేసు నమోదు

పిఠాపురం రూరల్‌, ఫిబ్రవరి 11: ఆన్‌లైన్‌లో జీడిపప్పు ఆర్డర్‌ చేసి సరుకు ఇచ్చిన తర్వాత కొంత సొమ్ము ఇచ్చి మిగిలినది ఇవ్వకుండా మోసగించిన కంపెనీపై పిఠాపురం రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ సమీపంలోని చుట్టు గ్రామానికి చెందిన చుండ్రు సాయి ప్రద్వల్‌  బి.ప్రత్తిపాడు కేంద్రం ఆన్‌లైన్‌లో జీడిపప్పు వ్యాపారం చేసేందుకు లైసెన్సులు పొందాడు. అతడికి కోయంబత్తూరుకు చెందిన ఫార్మా ఆగ్రో కంపెనీ రూ.6.95 లక్షలు విలువైన 960 కిలోల జీడిపప్పును ఆర్డర్‌ చేసింది. దీంతో సాయిప్రద్వల్‌ రైలులో 960 కిలోల జీడిపప్పును కోయంబత్తూరు పంపగా వారు రూ.1.45 లక్షలు చెల్లించారు. మిగిలిన సొమ్ము చెల్లించకుండా ముఖం చాటేశారు. తాను మోసపోయినట్టు గుర్తించిన సాయి ప్రద్వల్‌ రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కోయంబత్తూరుకు చెందిన ఫార్మా ఆగ్రో కంపెనీ, అందులోని ఉద్యోగులు సరాయి మురుగన్‌, హారిణి, రేణు, ప్రదీప్‌, మురుగన్‌లపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ చైతన్యకుమార్‌ తెలిపారు.

Updated Date - 2020-02-12T09:08:49+05:30 IST