కరోనా తగ్గిందనుకోవడం పొరపాటు

ABN , First Publish Date - 2020-12-17T05:37:13+05:30 IST

కాకినాడ, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ ఉధృతి తగ్గిందని అనుకోవడం పొరపాటని, ఈ రుగ్మతను సమూలంగా పారదోలాలంటే స్వీయ

కరోనా తగ్గిందనుకోవడం పొరపాటు

కాకినాడ, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ ఉధృతి తగ్గిందని అనుకోవడం పొరపాటని, ఈ రుగ్మతను సమూలంగా పారదోలాలంటే స్వీయ రక్షణ చర్యలు తప్పనిసరని జిల్లా పరిశ్రమల కేంద్రం (డీఐసీ) జాయింట్‌ డైరెక్టర్‌ బి.శ్రీనివాసరావు పేర్కొ న్నారు. రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో అవంతి ఫ్రోజోన్‌ ఫుడ్‌ పరిశ్రమలో సిబ్బందికి కరోనా పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు. జేడీ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ విధులు నిర్వర్తించాలన్నారు. ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ కేపీ సుధాకర్‌, డీఐసీ డీడీ పాక దొరబాబు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-17T05:37:13+05:30 IST