కారు ఢీకొని వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2020-10-28T04:39:42+05:30 IST
జాతీయ రహదారిపై కత్తిపూడి లారీ యూనియన కూడలి వద్ద మంగళవారం ఉదయం కారు ఢీకొనడంతో గ్రామానికి చెందిన దేశెట్టి మాణిక్యం (74) మృతిచెందాడు.
శంఖవరం, అక్టోబరు 27: జాతీయ రహదారిపై కత్తిపూడి లారీ యూనియన కూడలి వద్ద మంగళవారం ఉదయం కారు ఢీకొనడంతో గ్రామానికి చెందిన దేశెట్టి మాణిక్యం (74) మృతిచెందాడు. అన్నవరం పోలీసుల వివరాల ప్రకారం... మాణిక్యం పొలానికి వెళుతూ రోడ్డు దాటుతుండగా తుని వైపు నుంచి వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయాడు. అన్నవరం ఎస్‌ఐ కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రత్తిపాడు తరలించారు.