కారు-బైకు ఢీకొని ఒకరి మృతి

ABN , First Publish Date - 2020-10-24T06:35:38+05:30 IST

కారు-బైక్‌ ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఛత్తీస్‌ గడ్‌లోని కుర్తికి చెందిన మడకం దుర్గ(35) శుక్రవారం చిం తూరు మండలం చట్టి మీదుగా మడకం సింగ అనే మరో వ్యక్తితో కలసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో వీరాపురంవద్ద కారును ఢీకొట్టాడు.

కారు-బైకు ఢీకొని ఒకరి మృతి

చింతూరు, అక్టోబరు 23: కారు-బైక్‌ ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఛత్తీస్‌ గడ్‌లోని కుర్తికి చెందిన మడకం దుర్గ(35) శుక్రవారం చిం తూరు మండలం చట్టి మీదుగా మడకం సింగ అనే మరో వ్యక్తితో కలసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో వీరాపురంవద్ద కారును ఢీకొట్టాడు. దీంతో మడకం దుర్గ అక్కడికక్కడే మృతి చెందాడు. సింగకు గాయాలయ్యాయి. విజయవాడకు చెందిన కారు వాస్తవానికి చింతూరు మీదుగా మోతుగూడెం వెళ్లాల్సి ఉంది. కాగా దారి తెలియకపోవడంతో డ్రైవర్‌ కొంట వైపు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సురేష్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - 2020-10-24T06:35:38+05:30 IST