చెల్లెలితో కలిసి బైక్‌పై ఇంటికి వెళ్తుండగా.. కారు ఢీకొట్టడంతో..

ABN , First Publish Date - 2020-09-29T17:22:51+05:30 IST

జాతీయ రహదారిపై గొల్లప్రోలు మండలం చెందుర్తి శివారులో మోటారు సైకిల్‌ను..

చెల్లెలితో కలిసి బైక్‌పై ఇంటికి వెళ్తుండగా..  కారు ఢీకొట్టడంతో..

గొల్లప్రోలు(తూర్పు గోదావరి): జాతీయ రహదారిపై గొల్లప్రోలు మండలం చెందుర్తి శివారులో మోటారు సైకిల్‌ను కారు ఢీకొనడంతో మహిళ మృతి చెందింది. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. తుని మండలం తేటగుంట గ్రామానికి చెందిన మామిడి ఆదినారాయణ, ఆమె మేనత్త దేవారపు వరలక్ష్మి, చెల్లి చిట్టూరి రాధతో కలిసి మోటారుసైకిల్‌పై ప్రత్తిపాడు మండలం ఒమ్మంగిలో ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా చెందుర్తి సమీపంలోని కేహెచ్‌పేట వద్ద రాజమహేంద్రవరం నుంచి తుని వెళ్తున్న కారు ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా తుని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వరలక్ష్మిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మరణించింది. గొల్లప్రోలు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2020-09-29T17:22:51+05:30 IST