డీఆర్‌డీఏ పథకాలపై ప్రచారం నిర్వహించాలి

ABN , First Publish Date - 2020-10-07T09:41:43+05:30 IST

డీఆర్‌డీఏ ద్వారా మహిళా సమాఖ్యలకు అమలు చేస్తున్న బ్యాంకు లింకేజి రుణాలు, వైఎస్సార్‌ అసరా, బీమా తదితర పఽథకాలపై ప్రచారం నిర్వహించాలని ఆశాఖ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ హరిహరనాథ్‌ పేర్కొన్నారు...

డీఆర్‌డీఏ పథకాలపై ప్రచారం నిర్వహించాలి

పీడీ హరిహరనాథ్‌


సామర్లకోట, అక్టోబరు 6: డీఆర్‌డీఏ ద్వారా మహిళా సమాఖ్యలకు అమలు చేస్తున్న బ్యాంకు లింకేజి రుణాలు, వైఎస్సార్‌ అసరా, బీమా తదితర పఽథకాలపై ప్రచారం నిర్వహించాలని ఆశాఖ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ హరిహరనాథ్‌ పేర్కొన్నారు. మంగళవారం సామర్లకోట టీటీడీసీ ఆవరణలో డీఆర్‌డీఏ సిబ్బంది సమావేశం ఏపీడీ శ్రీనివాసకుమార్‌ అధ్యక్షతన జరిగింది. అర్హులైన మహిళా సమాఖ్యలకు రుణసదుపాయం కల్పిస్తున్నందున బ్యాంకు రుణాలు సద్వినియోగం చేసుకోవా లన్నారు. అలాగే బీమా పఽథకాలు అమలు చేస్తున్నందున ప్రతీ మహిళా సభ్యు రాలికి అవగాహన కల్పించాలన్నారు. మండలాల వారీగా రుణాల మంజూరు, చెల్లింపులు తదితర అంశాలపై పీడీ సమీక్షించారు. సమావేశంలో డీపీఎం వెంకటేశ్వరరావు, బాబూరావు, వేదకుమారి శేషగిరి, లక్ష్మి పాల్గొన్నారు.

Read more