కేబుల్‌ ఆపరేటర్లపై వేసిన పోల్‌ ట్యాక్స్‌ రద్దు చేయాలి

ABN , First Publish Date - 2020-12-30T06:04:05+05:30 IST

కేబుల్‌ ఆపరేటర్లపై ప్రభుత్వం వేసిన పోల్‌ట్యాక్సును రద్దుచేయాలని మల్టీ సర్వీ సెస్‌ కేబుల్‌ ఆపరేటర్ల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.వెంక ట్రావు డిమాండ్‌ చేశారు.

కేబుల్‌ ఆపరేటర్లపై వేసిన పోల్‌ ట్యాక్స్‌ రద్దు చేయాలి

అమలాపురం టౌన్‌, డిసెంబరు 29: కేబుల్‌ ఆపరేటర్లపై ప్రభుత్వం వేసిన పోల్‌ట్యాక్సును రద్దుచేయాలని మల్టీ సర్వీ సెస్‌ కేబుల్‌ ఆపరేటర్ల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.వెంక ట్రావు డిమాండ్‌ చేశారు. మంగళవారం స్థానిక దుడ్డువారి అగ్రహారంలోని ముస్లిం షాదిఖానా భవనంలో నియోజకవర్గ ఇన్‌చార్జి లంకలపల్లి తాతయ్యనాయుడు అధ్యక్షతన నిర్వహించిన అమలాపురం డివిజన్‌ కేబుల్‌ ఆపరేటర్ల అసోసియేషన్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా సంఘ గౌరవాధ్య క్షుడు అడపా వెంకట్రావు, జిల్లా అధ్యక్షుడు కేఆర్‌ కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి ఎం.లక్ష్మీప్రసాద్‌, ఉపాధ్యక్షుడు చలపతిరావు, కోశాధికారి దేవు గోవిందు, డివిజన్‌ సంఘ నాయకులు గుమ్మళ్ల పుల్లయ్యనాయుడు, దూనబోయిన రవికుమార్‌, రెడ్డి సత్యనారాయణ, దున్నాల రామారావు, బి.శ్రీను  పాల్గొన్నారు.


జాతీయస్థాయి బాక్సింగ్‌ పోటీలకు విద్యార్థుల ఎంపిక

అమలాపురం రూరల్‌, డిసెంబరు 29: రాష్ట్రస్థాయి థాయ్‌ బాక్సింగ్‌ పోటీల్లో అద్భుత ప్రతిభ చాటి స్వర్ణ పతకం సాధిం చిన చింతా అనీలసుధ జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్టు అమలాపురం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల హెచ్‌ఎం నాయుడు వెంకటేశ్వరరావు తెలిపారు. అమలాపురం మం డలం భట్నవిల్లి గ్రామానికి చెందిన సుధ స్థానిక ఉన్నత పాఠ శాలలో ఆరో తరగతి చదువుతోంది. రాజమహేంద్రవరానికి చెందిన కోచ్‌ పట్టపగలు సంతోష్‌ శిక్షణలో బాక్సింగ్‌ తర్ఫీదు పొందిన సుధ ఈనెల 26,27తేదీల్లో విశాఖ జిల్లా పాయక రావుపేట సిద్ధార్థ స్కూల్‌ గ్రౌండ్‌లో జరిగిన రాష్ట్రస్థాయి థాయ్‌ బాక్సింగ్‌ పోటీల్లో  అండర్‌-12 బాలికల 42-44కిలోల విభాగంలో సుధ ప్రథమస్థానం సాధించి బంగారు పతకం సాధించింది.  జాతీయస్థాయి బాక్సింగ్‌ పోటీలకు ఎంపికైన సుధను స్థానిక క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాం ఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ అభినందించారు. పాఠశాలలో అభినందన సభ నిర్వహించారు. 

 ఆలమూరు విద్యార్థుల ప్రతిభ 

ఆలమూరు, డిసెంబరు 29: విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో ఈనెల26 నుంచి 28వరకు జరిగిన రాష్ట్రస్థాయి కిక్‌బాక్సింగ్‌ పోటీల్లో  మండల విద్యార్థులు  విజేతలుగా నిలిచి  జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్టు సీనియర్‌ కిక్‌బాక్సింగ్‌ మాస్టర్‌ టి.అబ్బులు తెలిపారు.  పలువురు విద్యార్థులు వివిధ విభాగాల్లో గోల్డ్‌, సిల్వర్‌ మెడల్స్‌ సాధించినట్టు చెప్పారు. విద్యార్థులను ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అభినందించి రూ.10వేలు బహుమతి అందించారు. విద్యార్థులను జిల్లా కరాటే మాస్టర్ల అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు చల్లా ప్రభాకరరావు, మాస్టర్లు, టి.అబ్బులు, సత్తిబాబు, సత్యశ్రీ, నాయకులు తమ్మన శ్రీనివాస్‌, నెక్కంటి బుజ్జి, అశోక్‌రెడ్డి, తాడి ఆదిత్యారెడ్డి, నామాల శ్రీనివాస్‌ తదితరులు అభినందించారు. 


బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి పూలే  

కాజులూరు, డిసెంబరు 29: బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావుపూలే అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌లు పేర్కొన్నారు. గొల్లపాలెంలో మంగళవారం మహాత్మా జ్యోతిరావుపూలే, సావిత్రిబాయి పూలేల విగ్రహాలను వారు ఆవిష్కరించారు. అనంతరం మేడిశెట్టి శ్రీరాములు మాస్టారు అధ్యక్షతన ఏర్పాటుచేసిన సభలో వారు మాట్లాడారు.  కార్యక్రమంలో దత్తపీఠం శృంగవృక్షం శ్రీసాయిదత్తనాగానంద సరస్వతి స్వామీజీ, న్యాయవాది పిల్లి శ్రీనివాసరావు, వ్యాపారవేత్త బొక్కా శ్రీనివాసరావు, శీలమంతుల వీరభద్రరావు, ఏడిద బ్రహ్మానందంచార్యులు, రామచంద్రపురం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మేడిశెట్టి సూర్యనారాయణ, మాజీ ఎంపీపీ బొడ్డు విష్ణుమూర్తి, అమలాపురం పార్లమెంట్‌ బీసీసెల్‌ అధ్యక్షుడు కడలి రాంపండు, తదితరులు పాల్గొన్నారు.ఢిల్లీ హైకోర్టు జడ్జి పూజలు

అయినవిల్లి, డిసెంబరు 29: అయినవిల్లి శ్రీసిద్ధివినాయకస్వామిని ఢిల్లీ హైకోర్టు జడ్జి వి.కామేశ్వరరావు మంగళవారం దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత అధికారులు, అర్చకులు  ఆలయ మర్యాదలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. నూతన సంవత్సర క్యాలెండర్‌, స్వామివారి చిత్రపటాన్ని ఆయనకు అందజేశారు. 


 గురుకుల పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

అమలాపురం రూరల్‌, డిసెంబరు 29: సమనసలో మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమం గురుకుల పాఠశాలలో ఆరు నుంచి తొమ్మిదో తరగతిలో చేరడానికి  దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా కన్వీనర్‌, ప్రిన్సి పాల్‌ డాక్టర్‌ వైటీఎస్‌ రాజు మంగళవారం   తెలిపారు.  మరింత సమాచారం కోసం గురుకుల పాఠశాల కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. 


అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ 

ఆలమూరు, డిసెంబరు 29: అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉన్న ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు ఐసీడీఎస్‌ సీడీపీవో గజలక్ష్మి తెలిపారు. బడుగువానిలంకలోని అంగన్‌వాడీ  సెంటర్‌-3లో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టును ఎస్టీ జనరల్‌, అంగన్‌వాడీ సహాయకులు జొన్నాడ-3 (ఓసీ వీహెచ్‌), పెనికేరు-1 (బీసీ-సి), చెముడులంక-4 (ఓసీ)కి కేటాయించినట్టు చెప్పారు. జనవరి 8లోపు దరఖాస్తులు అందించాలని సూచించారు.  


Updated Date - 2020-12-30T06:04:05+05:30 IST