మోటార్‌సైకిల్‌ ఢీకొని వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2020-12-06T05:57:18+05:30 IST

వెనుక నుంచి మోటార్‌సైకిల్‌ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. చేబ్రోలు ఏకే మల్లవరానికి చెందిన వింజరపు వీరన్నదొర (49) అదే గ్రామానికి చెందిన యర్రమిల్లి సత్యనారాయణ వద్ద గుమస్తాగా పనిచేస్తున్నాడు.

మోటార్‌సైకిల్‌ ఢీకొని వ్యక్తి మృతి
పరిశీలిస్తున్న పోలీసులు

 కొత్తపల్లి, డిసెంబరు 5: వెనుక నుంచి మోటార్‌సైకిల్‌ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు.  చేబ్రోలు ఏకే మల్లవరానికి చెందిన  వింజరపు వీరన్నదొర (49) అదే గ్రామానికి చెందిన యర్రమిల్లి సత్యనారాయణ వద్ద గుమస్తాగా పనిచేస్తున్నాడు. దీంతో సత్యనారాయణ కుమార్తె  శ్రీరాంపురంలో గ్రామ వలంటీరుగా పనిచేయడంతో ఆమెను శనివారం అక్కడికి తీసుకెళ్లాలని వీరన్నదొరకు చెప్పారు. దీంతో వీరన్నదొర శ్రీ రాంపురం వెళ్లి  తిరిగి వస్తుండగా వెనుక నుంచి వేగంగా మరో మోటార్‌సైకిల్‌ వీరన్నదొరను ఢీకొట్టింది. దీంతో వీరన్నదొర బీచ్‌రోడ్డుపైకి ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బిల్లు కలెక్టర్‌ సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కొత్తపల్లి  ఇన్‌ఛార్జి ఎస్‌ఐ కర్రి పార్థసారథి తెలిపారు. 

 

Updated Date - 2020-12-06T05:57:18+05:30 IST