ఆవ భూముల్లో రూ.150 కోట్ల అవినీతి

ABN , First Publish Date - 2020-08-20T11:56:08+05:30 IST

బూరుగుపూడి అయ్యన్నగళ్ల సమీపంలో పేదల..

ఆవ భూముల్లో రూ.150 కోట్ల అవినీతి

సీబీఐ దర్యాప్తు జరపండి

తెలుగుదేశం డిమాండ్‌ 


కోరుకొండ, ఆగస్టు 19 : బూరుగుపూడి అయ్యన్నగళ్ల సమీపంలో పేదల ఇళ్ల స్థలా ల కోసం ప్రభుత్వం సేకరించిన ఆవ భూ ముల్లో జరిగిన అవినీతికి నిరసనగా బుధవారం మాజీ ఎమ్మెల్యే పెం దుర్తి వెంకటేష్‌ నాయకత్వంలో గంటసేపు జలదీక్ష చేపట్టారు. ఇదే సందర్భంలో రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ముంపునకు గురైన ఆవ భూములను పరిశీలించారు. వెంకటేష్‌తో కలసి గోరంట్ల మీడియాతో మాట్లాడారు. రూ.15 లక్షలు విలువ కూడా చేయని భూములకు రూ.47 నుంచి రూ.60 లక్షల వరకూ చెల్లించడం వెనుక భారీ అవినీతి జరిగిందన్నారు.


పేదల ఇళ్ల స్థలాల కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం కొనుగోలు చేసిన ప్రతి ఎకరాలోనూ అవినీతి జరిగిందని, దీనిపై సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఇదొక్కటే కాదని రాజానగరం నియోజకవర్గంలో గడిచిన 14 నెలల కాలం లో మట్టి, ఇసుక, భూములు కొనుగోలు, కొండలను మాయం చేయడం ద్వారా రూ.700 కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు రొంగల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-20T11:56:08+05:30 IST