5 నుంచి సీజన్, దివ్యాంగుల బస్ పాసుల జారీ
ABN , First Publish Date - 2020-10-03T07:41:54+05:30 IST
కొవిడ్ నిబంధనల కారణంగా నిలిపివేసిన నెలవారీ సీజన్ టికెట్లు (ఎంఎ్‌సటీ), దివ్యాంగులకు జారీచేసే ప్రయాణ రాయితీ బస్ పాసులను ఈ నెల 5వ తేదీ నుంచి తిరిగి జారీ చేయనున్నట్టు ఆర్టీసీ రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరం అర్బన్, అక్టోబరు 2: కొవిడ్ నిబంధనల కారణంగా నిలిపివేసిన నెలవారీ సీజన్ టికెట్లు (ఎంఎ్‌సటీ), దివ్యాంగులకు జారీచేసే ప్రయాణ రాయితీ బస్ పాసులను ఈ నెల 5వ తేదీ నుంచి తిరిగి జారీ చేయనున్నట్టు ఆర్టీసీ రాజమహేంద్రవరం డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ఎన్వీఆర్ వరప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు 20 రోజులకు రుసుము చెల్లించి 30 రోజులు తిరిగే ఎంఎ్‌సటీ పాసులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. దివ్యాంగులకు ఇచ్చే పాసు ధర రూ.100 అని, ఆధార్ కార్డు, సదరం సర్టిఫికెట్, ఫొటో తీసుకుని వచ్చి పాసు పొందాలని కోరారు.